Breaking News

సంగీతఝురిలా.. తెలుగు భాష

Published on Sun, 12/29/2024 - 05:28

వన్‌టౌన్‌ (విజయవాడపశ్చిమ):  తెలుగు భాష వినసొంపైనదే కాకుండా.. సంగీతంలా మనసులను పరవశింపజేస్తుందని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కితాబిచ్చారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణాజిల్లా రచయితల సంఘం, విజయవాడ కాకరపర్తి భావనారాయణ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు విజయవాడలో శనివారం ప్రారంభమయ్యాయి. 

ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్‌ ఎన్వీ రమణ మహాసభలను ప్రారంభించి మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతులను కాపాడుకోవాలన్నారు. జాతి మనుగడకు, వికాసానికి భాష ప్రధానమైన పాత్ర పోషిస్తుందని, తెలుగు భాష సంగీతంలా మనసుకు హత్తుకుంటుందని చెప్పార

శ్రీశ్రీ, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, సీ నారాయణరెడ్డి వంటి గొప్ప కవులు రచయితలు ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, భానుమతి వంటి నటులు, మంగళంపల్లి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వంటి తెలుగు దిగ్గజాల గొప్ప వారసత్వం మనదన్నారు.  తెలుగు భాషా వికాసానికి అడ్డంకిగా ఉన్న జీవోలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.  
 
తెలుగు వారిలో అద్భుత ప్రతిభ..  
శాస్త్ర సాంకేతిక రంగాల్లో తెలుగువారు అద్భుతమైన ప్రతిభను కనబరిచి సమాజానికి స్ఫూర్తినిచ్చారని భారత రక్షణ మంత్రిత్వశాఖ ముఖ్య సలహాదారు డాక్టర్‌ జి.సతీష్ రెడ్డి  అన్నారు. సాహితీవేత్త పద్మభూషణ్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ నూతన సాంకేతిక మాధ్యమాలను వినియోగించుకుని తెలుగు రచనలను మరింత విస్తృతం చేసుకోవాలని సూచించారు.  

హోసూరు (తమిళనాడు) ఎంపీ కే గోపీనాథ్‌ మాట్లాడుతూ తెలుగు భాష పరిపుష్టికి తెలుగు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. రచయితల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుత్తికొండ సుబ్బారావు, జీవీ పూర్ణచంద్‌ మాట్లాడారు. తొలుత ‘మార్పు’ పేరుతో ముద్రించిన మహాసభల సావనీర్‌ను అతిథులు ఆవిష్కరించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)