6 నుంచి 10 వరకు పోలవరంపై వర్క్‌ షాప్‌

Published on Mon, 10/21/2024 - 05:08

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు పోలవరం ప్రాజెక్టు వద్ద వచ్చే నెల 6 నుంచి 10 వరకు వర్క్‌ షాప్‌ నిర్వహించేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) సిద్ధమైంది. ఈలోగా ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల మధ్య ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో సీపేజీ నీటిని పూర్తిగా తోడివేయాలని పోలవరం అధికారులను సీడబ్ల్యూసీ ఆదేశించింది. డయాఫ్రం వాల్‌ నిరి్మంచే ప్రాంతాన్ని సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తు వరకు ఇసుకతో నింపి, వైబ్రో కాంపాక్షన్‌ చేసి ప్లాట్‌ఫాంను సిద్ధం చేయాలని సూచించింది.

6వ తేదీన అంతర్జాతీయ నిపుణులు, పీపీఏ, సీడబ్ల్యూసీ అధికారుల బృందం పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకోనుంది. ఐదు రోజులపాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వర్క్‌ షాప్‌లో చర్చించి, నిర్ణయం తీసుకోనుంది. ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో వరదల ఉద్ధృతికి దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించే విధానంతోపాటు గ్యాప్‌–1, గ్యాప్‌–2లలో ప్రధాన డ్యాం డిజైన్‌ను ఈ సమావేశంలో ఖరారు చేయనున్నారు.

సీడబ్ల్యూసీ ఆదేశం మేరకు కాఫర్‌ డ్యాంల మధ్య నీటిని తోడే పనులను కాంట్రాక్టు సంస్థ మేఘా ముమ్మరం చేసింది. గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై ప్రధాన డ్యాం ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకున్న ప్రదేశాన్ని మే నాటికే సముద్ర మట్టానికి 16 మీటర్ల ఎత్తుతో ఇసుకను నింపి, వైబ్రో కాంపాక్షన్‌ చేసే పనులు పూర్తి చేసింది. సీపేజీ నీటిని పూర్తిగా తోడేశాక అంతర్జాతీయ నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని మరో మీటరు ఎత్తు పెంచడానికి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగించే బెంటనైట్‌ మిశ్రమం, కాంక్రీట్‌ను వర్క్‌ షాప్‌లో పరీక్షల నిమిత్తం సిద్ధంగా ఉంచారు.

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)