Breaking News

పాత పద్ధతిలోనే కొత్త డయాఫ్రం వాల్‌

Published on Mon, 09/30/2024 - 03:30

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు ఎగువన సమాంతరంగా కొత్తగా పాత పద్ధతిలోనే డయాఫ్రం వాల్‌ నిర్మించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ), కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ)కి అంతర్జాతీయ నిపుణుల కమిటీ మరోసారి స్పష్టం చేసింది. పాత డయాఫ్రం వాల్‌ను 15 నెలల్లో నిర్మించారని గుర్తు చేస్తూ.. కొత్త డయాఫ్రం వాల్‌ను ఈ ఏడాది నవంబర్‌ నుంచి 2025 జూలైలోగా పూర్తి చేయాలని పేర్కొంది.

ఒకే సీజన్‌లో ఆ పనులు చేసేందుకు అదనంగా గ్రాబర్లు, కట్టర్లు, అనుబంధ యంత్ర పరికరాలు, నిపుణులైన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించింది. డయాఫ్రం వాల్‌ డిజైన్, నిర్మాణంపై చర్చించేందుకు తక్షణమే వర్క్‌ షాప్‌ నిర్వహించాలని పేర్కొంది. ఈ మేరకు సీడబ్ల్యూసీ, పీపీఏలకు ఈనెల 20న అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. 

అందులో కమిటీ సిఫార్సులు ఇవీ.. 
⇒ ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంలు పటిష్టంగా ఉన్నాయి. వాటి భద్రతకు ఎలాంటి ముప్పు లేదు. ఎగువ కాఫర్‌ డ్యాంలో సీపేజీకి అడ్డుకట్ట వేయడానికి టోయ్‌ (అడుగు భాగం)లో ఫిల్టర్లు వేయాలి. 
⇒ ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాం మధ్య సముద్ర మట్టానికి 3 మీటర్ల లోపు ఎత్తు ఉండేలా సీపేజీ నీటిని గ్రావిటీతో పంపడంతోపాటు పంపులతో ఎత్తిపోయాలి. 

⇒  ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి నదీ గర్భం సముద్ర మట్టానికి సగటున 13 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దానిపై ఇసుకతో నింపి వైబ్రో కాంపాక్షన్‌ చేసి కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మాణానికి వీలుగా ప్లాంట్‌ఫామ్‌ సిద్ధం చేయాలి. పూర్తిగా పొడి వాతావరణంలోనే డయాఫ్రం వాల్‌ను నిర్మించాలి. 

⇒ కొత్త డయాఫ్రం వాల్‌ను పాత పద్ధతిలోనే నిర్మించాలి. గ్రాబర్లు, కట్టర్లతో రాతి పొర తగిలే వరకూ నదీ గర్భాన్ని తవ్వుతూ వాటిలో బెంటనైట్‌ మిశ్రమాన్ని పంపాలి. ఆ తర్వాత కాంక్రీట్‌ మిశ్రమాన్ని అధిక ఒత్తిడితో పంపితే బెంటనైట్‌ మిశ్రమం బయటకు వస్తుంది. కాంక్రీట్, ఒకింత బెంటనైట్‌ మిశ్రమం కలిసి ప్లాస్టిక్‌ కాంక్రీట్‌గా మారుతుంది. అదే డయాఫ్రం వాల్‌. గత 40 ఏళ్లుగా డయాఫ్రం వాల్‌ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఈ వాల్‌ ఎక్కడా విఫలమైన దాఖలాలు లేవు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)