Breaking News

ప్రధాన రహదారిపై నాట్లు

Published on Tue, 07/01/2025 - 03:10

ఏలేశ్వరం: ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ, భారీ గోతులు పడిన ఈ రోడ్డుపై మహిళలు నాట్లు వేసిన ఘటన ఇది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీకి వెళ్లే ప్రధాన రహదారి శిథిలమై దారుణంగా ఉంది. రమణయ్యపేట గ్రామం నుంచి పది కిలోమీటర్ల మేర ఈ రోడ్డు గోతులమయంగా మారింది.  కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత అధ్వానంగా మారింది. 

రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ఈ నేపథ్యంలో సీపీఐ (ఎంఎల్‌) వినోద్‌మిశ్రా, సీపీఎం అనుబంధ ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యాన మహిళలు ప్రధాన రహదారిపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రహదారిని పునర్నిర్మించేంత వరకూ కదిలేదిలేదని భీషి్మంచారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కూటమి  ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని మహిళలు, నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘాల నాయకులు లోత రామారావు, రెడ్డి ఆనంద్‌­పాల్, గండేటి నాగమణి తదితరులు పాల్గొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)