Breaking News

వైద్యురాలి భర్తపై కన్నేసిన మహిళ.. భార్యకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌తో దాడి

Published on Sun, 01/25/2026 - 05:00

కర్నూలు: కర్నూలు మెడికల్‌ కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ భర్తపై కన్నేసిన ఓ మహిళ భార్యాభర్తలను విడదీసేందుకు హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌తో దాడి చేసి, పోలీసులకు చిక్కి కటకటాలపాలైంది. కర్నూలు నగరం గణేష్‌ నగర్‌లో ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నివాసముంటున్నారు. నందికొట్కూరు రోడ్డులోని మల్లారెడ్డి వెంచర్‌లో నివాసముంటున్న బీచుపల్లి బోయ వసుంధరకు మహిళా వైద్యురాలి భర్తతో పరిచయం ఉంది. 

భార్యాభర్తలను విడదీస్తే తాను మరింత దగ్గర కావొచ్చన్న దురుద్దేశంతో ఆదోని ఇందిరాగాంధీ నగర్‌కు చెందిన కొంగె జ్యోతి, భూమా జస్వంత్, భూమా శృతితో కలిసి వైద్యురాలిపై దాడికి పథకం పన్నింది.  వైద్యురాలికి హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ ఇచ్చి, ఆమెకు హెచ్‌ఐవీ సోకిందని చెబితే ఆ జంట విడిపోతుందని భావించింది. ఈ నెల 9న ఆమె ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా లక్ష్మీనగర్‌ కేసీ కెనాల్‌ గట్టు వద్ద వైద్యురాలి వాహనాన్ని ఢీకొట్టారు. 

ఆమెను ఆటోలో ఎక్కించేందుకు సహాయం చేస్తున్నట్లు నటించి, హెచ్‌ఐవీ ఇంజెక్షన్‌ వేసి పరారయ్యారు. జరిగిన విషయాన్ని వైద్యురాలు తన భర్తకు చెప్పడంతో ఆయన మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ బాబు ప్రసాద్‌ పేర్కొన్నారు.  

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)