YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు
Breaking News
ఇది కాదా తప్పు..?
Published on Sat, 08/01/2026 - 14:01
శ్రీకాకుళం క్రైమ్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా కొత్తరోడ్డు వద్ద మహిళా ఎస్ఐ ఎం.ప్రవల్లికను జనంలోకి నెట్టివేసింది, ఆమె గుండెలపై చేయి వేసి తోసివేస్తోంది పోలీసులేనని ఓ ఫొటో రుజువు చేస్తోంది. కొత్తరోడ్డులో వైఎస్ జగన్ కాన్వాయ్ సమీపిస్తున్నప్పుడు కార్యకర్తలు ఎగబడుతున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
ఆమదాలవలస సీఐ సన్యాసినాయుడు ఎస్ఐ ప్రవల్లికను వెనక నుంచి వీపు మీదుగా భుజంపై చేయి వేయగా.. ముఖానికి స్కార్ప్, పోలీస్ క్యాప్ పెట్టుకున్న ఓ కానిస్టేబుల్ ఆమె గుండెలపై చేయి వేసి నెడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు బయటపడ్డాయి. వైఎస్సార్సీపీ శ్రేణులు, ఆమదాలవలస వైఎస్సార్సీపీ సమన్వయకర్త చింతాడ రవికుమార్పై పెట్టిన నాన్బెయిలబుల్ సెక్షన్లన్నీ ఇప్పుడు పోలీసులపై కూడా పెడతారా.. అని పలువురు ప్రశ్నిస్తుండటం విశేషం.
Tags : 1