Breaking News

సారీ మేడమ్‌.. మీరు రికార్డుల్లో చనిపోయారు

Published on Thu, 12/11/2025 - 05:38

మేడికొండూరు: కళ్లెదుట మని­షి బతికి ఉన్నా.. కంప్యూటర్లలో మాత్రం ఆమెను ఎప్పుడో చంపేసింది ప్రభుత్వం. సంక్షేమ పథకాల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ఆ మహిళకు ఈ విషయం తెలిసి గుండె ఆగినంత పనైంది. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం, భీమనేనివారిపాలెంలో బుధవారం ఈ ఘటన జరిగింది. భీమనేనివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా రైతు మద్దినేని రాధారాణికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ’అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌’ డబ్బులు జమ కాలేదు. 

దీంతో అనుమానం వచ్చిన ఆమె, బుధవారం గ్రామం పరిధిలోని అన్నదాత సుఖీభవ కేంద్రానికి వెళ్లింది. అక్కడి సిబ్బందిని తన స్టేటస్‌ చెక్‌ చేయమని కోరింది. కంప్యూటర్‌లో వివరాలు పరిశీలించిన సిబ్బంది నీళ్లు నమిలారు. మీరు చనిపోయినట్లు రికార్డుల్లో నమోదైంది అని చెప్పడంతో ఆమె కంగుతింది. ‘అయ్యా.. నేను మీ కళ్ల ముందే ఉన్నాను కదా! నన్ను చనిపోయినట్లు ఎలా రాస్తారు?‘ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 

ఇలా ఒక ఎంట్రీ తప్పుగా నమోదు కావడం వల్ల అర్హులైన పేదలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు ఆగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ప్రభుత్వం ఇష్టారాజ్యంగా రికార్డులు ఎలా మారుస్తుందని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా రికార్డులను సరిచేసి తనకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్‌ డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాధారాణి కోరుతున్నారు.  

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)