Breaking News

తండ్రి కనిపించలేదని... 13 ఏళ్ల కుమారుడి నిర్బంధం

Published on Sun, 09/28/2025 - 05:29

గిద్దలూరు రూరల్‌: గిద్దలూరు అటవీశాఖ అధికారులు ఆటవికంగా ప్రవర్తించారు. ఓ వ్యక్తి తమకు కనిపించకుండా పారిపోయాడని అతని కుమారుడైన 13 ఏళ్ల బాలుడిని రెండు రోజులు నిర్బంధించారు. ‘నీ భర్తను తీసుకువచ్చి మాకు అప్పగించి నీ కొడుకును తీసుకుపో...’ అని బాధిత బాలుడి తల్లికి హుకుం జారీ చేశారు. ఈ దుర్మార్గం స్థానికంగా మీడియా వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో శనివారం రాత్రి ఆ బాలుడిని వదిలేశారు. బాలుడి తల్లి తెలిపిన వివరాల ప్రకారం... వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్ల మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన కోనంగి పోలయ్య గొర్రెల వ్యాపారం చేస్తుంటాడు. 

ఈ నెల 24న ఆయన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం చింతరపల్లెకు వెళుతుండగా మార్గం మధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు కలిసి అడవి జంతువు మాంసం ఉందని చెప్పి అతనికి విక్రయించారు. పోలయ్య ఆ మాంసం తీసుకుని వెళుతుండగా బేస్తవారిపేట అటవీశాఖ రేంజ్‌ అధికారులు అడ్డుకుని మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. అడవి జంతువు మాంసం కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని బెదిరించి అతని వద్ద నుంచి రూ.35 వేలు వసూలు చేశారు. 

ఈ విషయం గిద్దలూరు అటవీశాఖ రేంజ్‌ అధికారులకు తెలిసి పోలయ్య కోసం అతని ఇంటికి వెళ్లారు. దీంతో పోలయ్య భయంతో పారిపోయాడు. శుక్రవారం మధ్యా­హ్నం ఇంటి వద్ద ఉన్న పోలయ్య కుమారుడు(13)ని అటవీశాఖ సిబ్బంది గిద్దలూరు తీసుకొచ్చి తమ కార్యాలయంలో నిర్బంధించారు. 

నీ భర్తను తీసుకురా... అంటూ హుకుం 
పోలయ్య భార్య రంగలక్ష్మమ్మ శనివారం ఉదయం గిద్దలూరు అటవీశాఖ రేంజ్‌ కార్యాలయం వద్దకు వచ్చి తన కుమారుడిని విడిచిపెట్టాలని అధికారులను వేడుకున్నారు. దీంతో ‘మీ భర్తను తీసుకురా.. మీ బిడ్డను తీసుకుపో..’ అంటూ అధికారులు హుకుం జారీ చేశారు. ‘నా భర్త తప్పు చేశాడని డబ్బులు కట్టించుకున్నారు. మళ్లీ ఈ విధంగా నా బిడ్డను నిర్బంధించడం ఏమి న్యాయం..’ అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. 

ఈ విషయం స్థానిక మీడియా వాట్సాప్‌ గ్రూపులు, సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అటవీశాఖ అధికారులు ఆందోళనకు గురయ్యారు. శనివారం రాత్రి 9గంటల సమయంలో రంగలక్ష్మమ్మ, ఆమె తరఫున వచ్చిన పెద్ద మనుషులతో సంతకాలు చేయించుకుని బాలుడిని వదిలిపెట్టారు. ఈ విషయంపై అటవీశాఖ గిద్దలూరు రేంజ్‌ ఆఫీసర్‌ సత్యనారాయణరెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.  

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)