రూ.50 లక్షలిస్తేనే కాపురం చేస్తానంటున్నాడు

Published on Fri, 07/17/2026 - 05:29

శ్రీకాకుళం క్రైమ్‌: తనతో కాపురం చేయాలంటే రూ.50 లక్షలు ఇవ్వాలని తన భర్త మన్యం పార్వతీపురం జిల్లా పాలకొండ అటవీ రక్షణ అధికారి గొల్లంగి తారకేశ్వరరావు వేధిస్తున్నట్లు అతడి భార్య, దళిత సినీనటి కనపర్తి దీనమ్మ గురువారం శ్రీకాకుళం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు చాలాసార్లు అబార్షన్‌ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంకళ్లుమర్రుకు చెందిన తాను 2017లో హైదరాబాద్‌లో నర్సుగా పనిచేస్తున్నప్పుడు ఫేస్‌బుక్‌లో శ్రీకాకుళం బలగకు చెందిన దూగాన జగదీష్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ద్వారా తనకు పరిచయమైనట్లు తెలిపారు.

‘2018లో జగదీష్‌ చిత్రీకరించిన ఒక పాటలో నటించాను. ఆ సమయంలో కెమెరామెన్‌గా చేస్తున్న తారకేశ్వరరావుతో ఏర్పడిన పరిచయం శారీరక సంబంధానికి దారితీసింది. 2020 డిసెంబరు 24న పెద్దల సమక్షంలో శ్రీకాకుళం వరం కాలనీలో పెళ్లి చేసుకున్నాం. మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ తీసుకుందామని అడిగితే ఉద్యోగంలో సమస్య వస్తుందని చెప్పేవాడు. పిల్లలు పుట్టకుండా చాలాసార్లు అబార్షన్‌ చేయించాడు.

నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చి సంపాదించిన డబ్బుల్లో రూ.40 లక్షల వరకు తారకేశ్వరరావు తీసుకున్నాడు. విశాఖపట్నంలో మరో మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడంతో గట్టిగా అడిగా. అప్పుడు నీతో బతికేది లేదు. కుటుంబసభ్యులు ఒప్పుకోవడం లేదు. రూ.50 లక్షలు ఇస్తేనే ఏలుకుంటా.. అని తారకేశ్వరరావు చెప్పాడు’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)