Breaking News

పంచాయతీ నిధుల బదిలీపై ఆలస్యం ఎందుకు?

Published on Sun, 08/24/2025 - 06:12

సాక్షి, అమరావతి: గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి కేంద్రం గత ఏడాది డిసెంబర్‌లో గ్రాంట్లుగా ఇచి్చన రూ. 1,121.20 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఆయా గ్రామీణ స్థానిక సంస్థలకు విడుదల చేయకపోవడాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం నుంచి నిధులు అందిన 10 పని దినాలలో రాష్ట్ర ప్రభు­­త్వం ఆయా గ్రామ పంచాయతీలు, ఇతర స్థాని­క సంస్థలకు బదిలీ చేయాల్సి ఉండగా.. ఇప్పటికీ ఎందుకు జమ చేయలేదో తెలపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం  ఇతర అవసరాలకు వినియోగించుకుంటూ వస్తోందన్న వార్తల నేపథ్యంలో ఈ తాజా పరిణామం చోటుచేసుకుంది.   

ఫిర్యాదుల నేపథ్యం.. 
‘ఈ – గ్రామ్‌ స్వరాజ్‌ పోర్టల్‌’లో నిధుల బదిలీ జరిగినట్లు కనిపించకపోవడంతో పాటు పలు సర్పంచ్‌ సంఘాలు ఈ అంశంపై కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖకు ఫిర్యాదు చేయడంతో కేంద్రం స్పందించింది.  కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ రాంప్రతాప్‌ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ..  ఇక ఎలాంటి ఆలస్యం లేకుండా  సంబంధిత  గ్రాంట్లను  వడ్డీతో సహా తక్షణమే విడుదల చేయాలని సూచించారు.  ఇందుకు రుజువుగా  గ్రాంట్‌ ట్రాన్స్‌ఫర్‌ సరి్టఫికెట్‌ను  కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలని  కూడా ఆ లేఖలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేశారు. కాగా, కేంద్రం లేఖ రాసి  దాదాపు 20 రోజులు పూర్తవుతున్నప్పటికీ, ఈ నిధులను రాష్ట్రం ప్రభుత్వం ఇప్పటికీ విడుదల చేయకపోవడం గమనార్హం.   

కేంద్రం నిధుల విడుదల ఇలా.. 
⇒ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్రం రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ల పేరిట కేంద్రం గత ఏడాది డిసెంబర్‌ 16వ తేదీన రూ. 446.48 కోట్ల బేసిక్‌ (అన్‌టైడ్‌) కేటగిరిలోనూ, అదే నెల మూడో వారంలో మరో రూ. 674.72 కోట్లు టైడ్‌ కేటగిరిలోనూ రాష్ట్ర ఆర్థిక శాఖకు విడుదల చేసింది.  

⇒ ఆ నిధులను  గ్రామ పంచాయతీలకు 70 శాతం, మండల పరిషత్‌లకు 20 శాతం, జిల్లా పరిషత్‌లకు 10 శాతం చొప్పున లెక్కకట్టి సంబంధిత బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం  జమ చేయాల్సి ఉంది.  

రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులపైనా ఆక్షేపణ 
రాష్ట్ర ఆర్థిక సంఘం (ఎస్‌ఎఫ్‌సీ) సిఫార్సుల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి గ్రామీణ స్థానిక సంస్థలకు జరగాల్సిన చెల్లింపుల వాటాపైనా సంబంధిత లేఖలో  కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని  ఆక్షేపించడం గమనార్హం.  4వ రాష్ట్ర ఆర్థిక సంఘం కాలపరిమితి 2024–25 ఆర్థిక సంవత్సరంతో పూర్తయినా తదుపరి ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేయకపోవడాన్ని కేంద్రం తప్పుపట్టింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం 2023 మార్చిలోనే ఏర్పాటు అయినప్పటికీ, దాని నివేదికను రాష్ట్ర శాసనసభలో సమర్పించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశి్నంచింది. ఐదవ రాష్ట్ర ఆర్థిక సంఘం నివేదిక వివరాలను సైతం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రం దృష్టికి తీసుకురావాలని ఆ లేఖలో ఆదేశించింది.  

సాక్షి ఎఫెక్ట్‌తో... ఏప్రిల్‌లో జీవోలు 
ఈ వ్యవహారంపై ఈ ఏడాది ఏప్రిల్‌ 21వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో  నిధులను విడుదల చేస్తున్నట్టు చెప్పుకోవడానికి అదే ఏప్రిల్‌ నెల 25వ తేదీన పంచాయతీరాజ్‌ శాఖ నుంచి  బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్స్‌ (బీఆర్వోలు) పేరుతో రెండు జీవోలను విడుదల చేసింది. వాటి అమలు మాత్రం లేదు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)