Breaking News

తల్లి చేసిన పనికి కొడుకు బలి

Published on Tue, 01/20/2026 - 05:59

భీమవరం: భర్తపై కోపంతో భార్య కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలుపుకొంటే.. ఆ విషయం తెలియక దానిని తాగి కుమారుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాలుడి తల్లి కొద్ది మొత్తంలో దానిని తాగినప్పటికీ ఆమెకు ఎలాంటి హాని జరగలేదు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామానికి చెందిన మన్యం వెంకట సుబ్బారావు తన భార్య లక్ష్మితో కలసి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం బలుసుమూడిలో నివాసముంటున్నాడు. వారికి ఇద్దరు సంతానం.

ఈనెల 16న సుబ్బారావు బయటికి వెళ్లేందుకు ప్రయాణమవుతున్న సమయంలో అతని భార్య లక్ష్మి సాయంత్రం షాపింగ్‌కు వెళ్లడం కోసం త్వరగా ఇంటికి రావాలని చెప్పింది. అయితే సుబ్బారావు ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. దీంతో కోపగించిన లక్ష్మి కూల్‌డ్రింక్‌ బాటిల్లో ఎలుకల మందు కలుపుకొని కొద్దిగా తాగి మిగిలినది వంటింట్లో పెట్టి నిద్రపోయింది. అయితే కూల్‌డ్రింక్‌లో ఎలుకల మందు కలిపిన విషయం తెలియని ఆమె ఐదేళ్ల కుమారుడు మహారుద్ర కాంత్‌ (5) దానిని తాగి నిద్రపోయాడు.

తెల్లవారుజామున రుద్రకాంత్‌ వాంతులు చేసుకోవడంతో ఎలుకల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ తాగినట్టు గ్రహించి అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో ఆదివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఈ ఘటనపై బాలుడి తండ్రి వెంకట సుబ్బారావు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు టూటౌన్‌ ఎస్‌ఐ రామారావు తెలిపారు.

Videos

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు