Breaking News

పట్టణాల్లో వసతులు మెరుగుపరుస్తాం

Published on Fri, 07/05/2024 - 05:13

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో మౌలిక వసతులను మెరుగు పరుస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఆయన గురువారం సచివాలయంలో 20 పట్టణాభివృద్ధి సంస్థల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. సీఆర్డీఏ సహా రాష్ట్రంలోని 20 యూడీఏల పరిధిలో వేసిన లే అవుట్లలో విద్యుత్తు, రోడ్లు, తాగు నీరు, పార్కులు, మురుగు నీటి పారుదల వ్యవస్థ ఏర్పాటు చేయడం యూడీఏలో ప్రధాన లక్ష్యమన్నారు. 

నెల్లూరు, కడప లేఅవుట్లలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయని, వాటిపై విచారణకు కమిటీని వేశామన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చాక బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో తణుకు మున్సిపాలిటీలో టీడీఆర్‌ బాండ్ల జారీ­లో అవకతవకలు జరిగాయ­ని చెప్పారు. దీనిపైనా విచారణ చేయించి బాధ్యుల­ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిలిచిపోయిన ఎంఐజీ, టిడ్కో గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తామని తెలిపారు. 

గతంలో తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇంటికీ  24 గంటలు తాగు నీరందించడానికి ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ ద్వారా రూ.5,300 కోట్లు కేటాయించామని, ఈ నిధుల్లో గత ప్రభుత్వం రూ.240 కోట్లే వెచ్చి0చిందన్నారు. మిగిలిన నిధుల వినియోగానికి  కాల పరిమితిని పెంచాలని ఆ బ్యాంకుకు లేఖ రాసినట్టు చెప్పారు. 2023–24లో వచ్చిన రూ.1100 కోట్లను కూడా దారి మళ్లించిందన్నారు. ఈ సమావేశంలో డీటీసీపీ విద్యుల్లత, పబ్లిక్‌ హెల్త్‌ ఇంజినీరింగ్‌ చీఫ్‌ ఆనందరావు పాల్గొన్నారు.  
 

Videos

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

ఇది పద్దతి కాదు.. కేటీఆర్ పై స్పీకర్ సీరియస్

వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు

అడ్డంగా ఇరుక్కున్నాక లోకేశ్ వాయిస్ లో బేస్ తగ్గింది..

అంతర్జాతీయంగా దుమారం రేపుతున్న ట్రంప్ పోస్ట్

ఇన్వెస్టర్లకు బిగ్ అప్ డేట్.. కొత్త ట్రేడింగ్ రూల్స్ ఇవే!

Photos

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)