Breaking News

ప్రతి అర్జీని పరిశీలించి నష్ట పరిహారం అందిస్తాం

Published on Wed, 10/23/2024 - 05:09

సాక్షి ప్రతినిధి, విజయవాడ: బుడమేరు వరద ముంపు ప్రభావంతో నష్టపోయిన ప్రతి కుటుంబానికీ నష్ట పరిహారం అందిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ డాక్టర్‌ నిధి మీనా స్పష్టం చేశారు. సాక్షి పత్రిక మెయిన్‌ ఎడిషన్‌లో మంగళవారం ‘అర్జీలు బుట్టదాఖలు ’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఇన్‌ఛార్జి కలెక్టర్‌ స్పందించారు. మంగళవారం నగరంలోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఆమె మాట్లాడుతూ..  ఇప్పటి వరకు బుడమేరు వరద నష్టంలో భాగంగా గృహ, ఎంఎస్‌ఎంఈ, వాహనాలు తదితర విభాగాలకు సంబంధించి 1,44,672 మంది వరద ప్రభావిత బాధితుల బ్యాంకు ఖాతా­ల్లో రూ.235.72 కోట్లను జమ చేశామని వివరించారు. 

179 గ్రామ వార్డు సచివాలయాల్లో వరద గణన జాబి­తా­ల ప్రచురణతో పాటు అదనంగా వచ్చిన దరఖాస్తులను పిజిఆర్‌ఎస్‌ ఫ్లడ్‌ మాడ్యూల్‌లో నమోదు చేశారన్నారు. ఆధార్‌­తో బ్యాంకు ఖాతా అనుసంధానించబడిన బ్యాంకు ఖాతాలకు నేరుగా పరిహా­రం జమ చేశారన్నారు.  బ్యాంకు ఖాతాలు అనుసంధానం కాని 476 ఖాతాలను అనుసంధానం చేసి చెల్లింపుల ప్రక్రియ జరిపేలా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న 2,478 దరఖాస్తులను పరిశీలించి నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఈనెల 24వ తేదీలోగా  అర్హులైన బాధితుల ఖాతా­ల్లో నష్ట పరిహారం జమ చేస్తామన్నారు. నష్టపోయి­న ప్రతి బాధితునికి పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి  స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.కాగా.. సాయం కోసం కలెక్టరేట్‌కు ఎన్ని దరఖాస్తులొచ్చాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)