Breaking News

స్పేస్‌ రిఫార్మ్‌ ఇయర్‌గా 2024–25

Published on Sat, 02/10/2024 - 05:25

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ఎస్‌ఐఎల్‌), ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) ఆధ్వర్యంలో రాబోయే 14 నెలల్లో 30 ప్రయో­గాలను నిర్వహించనున్నారు. 2024–25 ఆర్థిక ఏ­డా­దిని గగన్‌యాన్‌ సంవత్సరంగా ప్రకటించి 7 గగ­న్‌యాన్‌ ప్రయోగాత్మక పరీక్షలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించారు. అలాగే, స్కైరూట్‌ ఎయిరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందిన విక్రమ్‌–1టీబీడీ పేరుతో 4 ప్రయోగాలు, అగ్నికుల్‌ కాస్మోస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందిన అగ్ని­బాన్‌–టీబీడీ పేరుతో 3 ప్రయోగాలు చేయ­నున్నారు.

ఇస్రో పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో 8 ప్రయో­గాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటికే ఈ ఏడాది జనవరి 1న పీఎస్‌ఎల్‌వీ సీ57 ప్రయోగాన్ని పూర్తి చేశారు. వీటి తరువాత పీఎస్‌ఎల్‌వీ సీ58, సీ59, సీ61, సీ62, సీ63, పీఎస్‌ఎల్‌వీ ఎన్‌1, ఎన్‌2 పేరుతో 8 ప్రయోగాలు చేయడానికి సిద్ధ­మ­వు­తున్నారు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఈ నెల 17న జీ­ఎ‹­­­Ü­ఎల్‌వీ ఎఫ్‌14, తరు­వాత ఎఫ్‌15, ఎఫ్‌16, ఎఫ్‌17 ప్ర­యోగాలను చేయ­డానికి సంసిద్ధ­మ­వుతున్నారు. ఎ‹­Ü­ఎస్‌­ఎల్‌వీ సిరీస్‌లో డీ3, ఎస్‌1, ఎస్‌2 పేరుతో 3 ప్ర­యోగాలు, ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్‌ ద్వారా ఒక ప్ర­యోగంతో కలిసి ఈ ఏడాదిలో 30 ప్రయోగాలు చేయనున్నారు.

కాబట్టి ఈ ఏడాదిని ‘స్పేస్‌ రిఫార్మ్‌ ఇయర్‌’గా ఇస్రో ప్రకటించింది. 2023–24 ఆర్థిక ఏ­డా­దిలో భాగంగా మార్చిలోపు అగ్నిబాన్, ఎస్‌­ఎస్‌ఎల్‌వీ డీ3 ప్రయోగాలు చేయనున్నారు. 2024 ఏ­ప్రిల్‌ నుంచి 2025 మార్చి దాకా 26 ప్రయోగాలు చే­యడానికి ఇస్రో ప్రణాళిక రచించింది. ఈ ఏడాది గ­­గన్‌యాన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన 7 ప్ర­యో­గా­త్మక పరీక్షలు విజయవంతమైతే 2025 ఆఖరికి మా­నవుడిని అంతరిక్షంలోకి పంపించి క్షేమంగా భూ­మి­కి తీసుకువచ్చేందుకు ఇస్రోసమాయత్తమవుతోంది.

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)