Breaking News

గాల్లో నీరు పుడుతుందే.. తాగితే మస్తుగుంటుందే

Published on Sun, 12/08/2024 - 05:45

సాక్షి, విశాఖపట్నం :  
ఏంటీ మిషన్‌. వాటర్‌ ప్యూరిఫయరా..? 
యస్‌.. ఇది స్వచ్ఛమైన నీటిని అందించే మిషన్‌.. 

అరె.. దీనిలో నీరు నింపేందుకు పైప్‌ కనెక్ట్‌ చెయ్యలేదెందుకు.? 
అవన్నీ మీకెందుకు..? మీకు కావాల్సింది నీరే కదా.. 

అవును తాగాలని ఉంది. కానీ...!!!! 
నీ సందేహంతో పాటు.. దాహం కూడా తీరుతుందిలే. ఆ గ్లాస్‌ పట్టుకొని.. ట్యాప్‌ కింద పెట్టి చూడు.. 

అరే.. నీరు వస్తుంది.. ఇదెలా సాధ్యం..? 
అదే మ్యాజిక్కు.. మాయా లేదు.. మంత్రం లేదు.. నీటిపైపూ లేదు.. శ్రమా లేదు.. నేను గానీ.. గ్లాస్‌ పట్టానంటే.. ఈ ప్యూరిఫయర్‌ నుంచి నీరు రావాల్సిందే... 

బాబూ... ఆ ట్రిక్‌ ఏంటో చెప్పు..!!! 
చెప్తా.. ఈ ప్యూరిఫయర్‌కు నీటి పైప్‌ అవసరం లేదు. కేవలం గాలిలో ఉన్న తేమను ఆక్సిజన్‌ని తీసుకొని.. నీటిగా మార్చేసుకుంటుంది. మనకు ఎంచక్కా అందించేస్తుంది. 

అవునా.. నిజమా..!! 
నిజం. ఇది కొత్త టెక్నాలజీ.. నీటి ఎద్దడి లేకుండా.. రాబోయే తరాలకు స్థిరమైన భవిష్యత్తును అందించడమే లక్ష్యం అనే కాన్సెప్‌్టతో అమెరికాలో స్థిరపడ్డ ఇండియన్‌ దుర్గాదాస్‌ ఆవిష్కరణ. ఈమె ఒకప్పటి భారత క్రికెట్‌ క్రీడాకారిణి కూడా. అమెరికా వెళ్లిపోయిన తర్వాత.. యూఎస్‌ మహిళా టీమ్‌కు కెపె్టన్‌గా కూడా వ్యవహరించారు. ఆమె ఆలోచనల నుంచి పుట్టిందే ఏరోనీరో.  

మరి.. గాల్లో ఎన్నో రకాల విషవాయువులు కూడా ఉంటాయి కదా.. మరి అందులోంచి తయారైన నీటిలో ఆ విషం ఉండదా.? 
అదేం ఉండదు. ఇందులో నాలుగు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేయడంతో గాలిలోని  తేమను పోర్టబుల్‌ డ్రింకింగ్‌ వాటర్‌గా మారుస్తుంది. తొలుత ఎయిర్‌ ప్యూరిఫికేషన్‌ జరుగుతుంది. దీని ద్వారా గాల్లో మలినాలు తొలగిపోతాయి. అక్కడి నుంచి కార్బన్‌ ప్యూరిఫికేషన్‌ ద్వారా అసహ్యకరమైన రుచి, వాసన, రంగు తొలగిపోతాయి. అప్పుడు నీటిగా మారుతుంది. 

ఆ నీటిని యూవీ ప్యూరిఫికేషన్‌ చేసి బ్యాక్టీరియాని నాశనం చేస్తాయి. అప్పుడు మినరల్స్‌ మిళితమవుతాయి. దీని ద్వారా పీహెచ్‌ లెవల్స్‌ 7 నుంచి 8.5 పీహెచ్‌గా ఉంటాయి. అంటే.. పూర్తి ఆల్కలిన్‌ వాటర్‌గా గాలిలో తేమ మారి.. స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. 

భలేభలే.. మరి రోజుకు ఎన్ని లీటర్లు ఇస్తుందీ ఏరోనీరో..? 
ఇందులో భిన్నమైన రకాలున్నాయంట. 10 నుంచి 25 లీటర్ల వరకూ ఇంట్లో వినియోగించే ప్యూరిఫయర్లున్నాయి. ఇప్పటి వరకూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వాడుతున్నారు. ఈ ప్యూరిఫయర్ల  అమ్మకాల లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1,71,50,920 లీటర్ల నీటిని తయారు చేశారంట. అంతేకాదు.. 6,86,03,680 లీటర్ల నీటిని ఆదా చేశారంట. సంస్థ వినూత్న ఆలోచన, నీటిని ఆదా చేస్తున్న విధానాన్ని మెచ్చి.. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా పొందారు. 

అద్భుతం కదా.. మరి మీకెక్కడ తారసపడిందీ స్పెషల్‌ ప్యూరిఫయర్‌..? 
ఓ.. అదా.. నగరంలో డీప్‌టెక్‌ కాంక్లేవ్‌ జరుగుతోంది కదా.. అక్కడ టెక్‌ ఎక్స్‌పోలో సంస్థ ప్రతినిధులు దీన్ని ప్రదర్శనకు ఉంచారు. చూస్తే.. అద్భుతమనిపించింది. మేం మాత్రమే తెలుసుకుంటే సరిపోదు కదా.. అందుకే.. ‘సాక్షి’ పాఠకులకీ అందిస్తున్నాం. ఇప్పుడు సరదాగా ఈ ప్యూరిఫయర్‌ను చూసి.. గాల్లో నీరు పుడుతుందే.. తాగితే మస్తుగుంటుందే.. అని పాడుకుందామా....!!  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)