Breaking News

స్పెషలిస్ట్‌ వైద్యుల నియామకానికి వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ లు

Published on Mon, 09/11/2023 - 03:56

సాక్షి, అమరావతి: డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఆస్పత్రులతోపాటు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో 13 స్పెషాలిటీల్లో 343 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌ (సీఏఎస్‌ఎస్‌) పోస్టులను వైద్య, ఆరోగ్యశాఖ భర్తీ చేస్తోంది. ఇందుకోసం ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ సోమవారం నుంచి 15వ తేదీ వరకు వాక్‌–ఇన్‌ ఇంటర్వ్యూ లను నిర్వహించనుంది. ఎన్టీఆర్‌ జిల్లా డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ కార్యాలయంలో రోజు మార్చి రోజు ఈ నెల 15వ తేదీ వరకు ఇంటర్వ్యూ లు ఉంటాయి. రెగ్యులర్‌(లిమిటెడ్, జనరల్‌)/కాంట్రాక్ట్‌ విధానాల్లో వైద్యులను నియమించనున్నారు.

సెకండరీ హెల్త్‌ ఆస్పత్రుల్లో కాంట్రాక్ట్‌ పద్ధతిలో గిరిజన ప్రాంతాలను ఎంపిక చేసుకున్న వైద్యులకు నెలకు రూ.2.50 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.రెండు లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.30 లక్షలు చొప్పున వేతనాలు ఖరారు చేశారు. ఎన్‌హెచ్‌ఎం కింద బోధన, జిల్లా ఆస్పత్రుల్లో నియమించే వారికి రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తారు. ఇక ఎన్‌హెచ్‌ఎంలోని డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌లలో నియమించేవారికి మైదాన ప్రాంతాల్లో రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు చొప్పున వేతనాలు ఉంటాయి.

అభ్యర్థులు అదనపు వివరాల కోసం http://hmfw.ap.gov.in/ వెబ్‌సైట్‌ను, 6301138782 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలి. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు ఖాళీగా ఉండకుండా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గడిచిన నాలుగేళ్లలో 53వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. 

ఇంటర్వ్యూ ల నిర్వహణ షెడ్యూల్‌ ఇలా..
సోమవారం(11వ తేదీ): జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, జనరల్‌ ఫిజిషియన్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌
బుధవారం(13వ తేదీ): గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్‌టీ, పెథాలజీ
శుక్రవారం(15వ తేదీ): పీ­డి­­­యా­­ట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్‌ డిసీజెస్‌ 

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు