Breaking News

రోడ్డెక్కిన వీఆర్‌ఏలు

Published on Wed, 12/17/2025 - 04:55

మంగళగిరి టౌన్‌: గ్రామ రెవెన్యూ సహాయకుల ప్రధాన సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ఏపీ వీఆర్‌ఏ సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) డిమాండ్‌ చేసింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద మంగళవారం మహాధర్నా నిర్వహించారు.  ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 700 మందికి పైగా వీఆర్‌ఏలు పాల్గొన్నారు. గంటల తరబడి ఎండలో కూర్చున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. 

జేఏసీ నేతలు మాట్లాడుతూ..తెలంగాణ తరహాలో ఏపీలో కూడా వీఆర్‌ఏలందరికీ పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 20 వేల మంది వీఆర్‌ఏలకు గౌరవ వేతనం ఇచ్చి ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటోందని విమర్శించారు. సమస్యలను పరిష్కరించక పోగా నైట్‌ డ్యూటీలు, రీ సర్వేలు వంటి అదనపు పనులు చేయించుకుంటూ వేధింపులకు గురిచేస్తోందని మండిపడ్డారు. 

అర్హత  ఉన్న వీఆర్‌ఏలకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. చనిపోయిన వీఆర్‌ఏల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 30లోపు ఈ సమస్యలను పరిష్కరించని పక్షంలో మరుసటి రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం సీసీఎల్‌ఏ అధికారికి వినతిపత్రమిచ్చారు.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)