Breaking News

వీఓఏల పోరుబాట

Published on Thu, 11/21/2024 - 05:05

సాక్షి నెట్‌వర్క్‌: తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీఓఏలకు సంబంధించి మూడేళ్ల కాలపరిమితితో జారీచేసిన సర్క్యులర్‌ను రద్దుచేస్తా­మని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలుచేయాలని వెలుగు వీఓఏల యూనియన్‌ డిమాండ్‌ చేసింది. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ వెలుగు యానిమేటర్స్‌ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో బుధవారం కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. 

ఆ సర్క్యులర్‌ కారణంగా వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని వారన్నారు. దానిని రద్దు­చేయాలని ఎన్నికల ముందు తాము ఆందోళన చేస్తున్న సమయంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య స్వయంగా హాజరై, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, సర్క్యులర్‌ని రద్దుచేస్తామని, చంద్రబాబు తన మాటగా నన్ను చెప్పమన్నారని వర్ల హామీ ఇచ్చారని వీఓఏలు విజయవాడలో చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం సర్క్యులర్‌ను రద్దుచేయకపోగా దాని ఆధారంగా మూడేళ్లు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చని రాష్ట్ర గ్రామీణ పేద­రిక నిర్మూలన సంస్థ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ప్రకటనలు చేయడాన్ని యూనియన్‌ తప్పుబట్టింది. 

ఈ ప్రభుత్వం అధికారం చేప­ట్టాక ఎన్టీఆర్‌ జిల్లాలో 200 మందిని తొలగించారన్నారు. ఈ సర్కులర్‌ను రద్దుచేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వీఓ­ఏలు ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. హెచ్‌ఆర్‌ పాలసీ అమలు, గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌక­ర్యం అమలుచేయాలని.. నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని, మహిళా మా­ర్ట్‌ల్లో బలవంతపు సరుకుల కొను­గోలు ఆపా­లని భీమవరం, విశాఖç­³ట్నం, అల్లూరి సీతా­రామరాజు జిల్లా చింతూరు, పార్వ­తీ­పురం మన్యం జిల్లా, శ్రీకాకుళం, అనకాపల్లి, అమలా­పురం, కాకినాడలో వీఓఏలు డిమాండ్‌ చేశారు. 

కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని నిబంధనలకు విరు­ద్ధంగా తొలగించడం అన్యాయమని కర్నూలు, నంద్యాల కలెక్టరేట్ల వద్ద జరిగిన ధర్నాలో వీఓఏలు నినదించారు. రాజకీయ వేధింపులు ఉండవని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభు­త్వం అధికారంలోకి వచ్చాక వేధింపులు చేయ­డం ఎంతవరకు న్యాయమని చిత్తూరులో వీఓఏలు ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ ధర్నాలకు ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్‌) ఉద్యోగుల రాష్ట్ర  సంఘం (సీఐటీయూ) నేతృత్వం వహించింది.  

విశాఖలో వీఏఓల నిరసన జ్వాలలు

Videos

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో YSRCP సవాల్

ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్ లైన్ ధ్వంసం.. డ్రైవర్ స్పాట్ డెడ్..!

నామినేషన్లకు వస్తే.. కంకర రాళ్లతో కొడతాం

మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్! మెగా కింగ్ కాంబో?

ఎంత దారుణం అంటే.. బాలకృష్ణ, లోకేష్ తో ఫోన్ చేయించి.. RK రోజా సంచలన నిజాలు

నెల్లూరులో స్క్రూటినీ పేరుతో అధికారుల హైడ్రామా

తాడిపత్రిలో జేసీ ఒత్తిళ్లకు తలొగ్గిన ఎన్నికల అధికారులు

కోమటిరెడ్డి Vs అనిరుధ్ రెడ్డి.. డిండి నీళ్ల పంచాయితీ

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)