Breaking News

పీపీపీకి ఇవ్వం.. మేమే రోడ్లు వేస్తాం: వీఎంసీ

Published on Sat, 02/21/2026 - 18:18

విజయవాడ: బెజవాడ రోడ్లను వీపీపీకి  ఇచ్చేందుకు విజయవాడ  మున్సిపల్‌ కార్పోరేషన్‌(వీఎంసీ) నిరాకరించింది. విజయవాడ నగర పరిధిలోని రోడ్లను తామే అభివృద్ధి చేయాలని వీఎంసీ నిర్ణయించింది. ఈరోజు(శనివారం, ఫిబ్రవరి 21వ తేదీ) జరిగిన వీఎంసీ కౌన్సిల్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాంతో చంద్రబాబు ప్రభుత్వానికి వీఎంసీ షాకిచ్చినట్లయ్యింది.

దీనిలో భాగంగా  విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. ‘ 165 అంశాల పై చర్చించాం. విజయవాడలో 19 రోడ్లను పీపీపీకి ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కౌన్సిల్‌లో తిరస్కరించాం. వీఎంసీ పరిధిలో చాలా మంది కాంట్రాక్టర్లు ఉన్నారు. పీపీపీ మోడల్‌లో రోడ్లను ఒకే కాంట్రాక్టర్‌కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలా చేయడం వల్ల వీఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ నిర్వీర్యం అవుతుంది. 

విజయవాడ అభివృద్ధి వీఎంసీ పరిధిలో జరగాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. కౌన్సిల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం వీఎంసీకి మెమో ఇవ్వడం దారుణం. వీఎంసీకి కొన్ని అధికారాలున్నాయ్. ప్రభుత్వం వీఎంసీకి ఇచ్చిన మెమోను కౌన్సిల్‌లో తిరస్కరించాం. నాడు నేడు స్కూల్స్‌కు ఈ ప్రభుత్వం ఇప్పటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.  వైఎస్‌ జగన్  హయాంలో అనేక స్కూల్స్ బాగుచేశారు’ అని తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)