Breaking News

మిస్‌ తెలుగు యూఎస్‌ఏ పోటీల్లో రెండోరన్నరప్‌గా విజయనగరం జిల్లా అమ్మాయి

Published on Wed, 05/28/2025 - 02:34

తెర్లాం: విజయనగరం జిల్లా తెర్లాం మండలం సోమిదవలసకు చెందిన యువతి అందానికి అమెరికా ఫిదా అయింది. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రం డల్లాస్‌లో ఈనెల 25న జరిగిన తెలుగు అమ్మాయిల అందాల (‘మిస్‌ తెలుగు యూఎస్‌ఏ–2025’) పోటీల్లో ‘చందక సాయిసాత్విక’ రన్నరప్‌–2గా నిలిచింది. ఓ వైపు అందం.. మరోవైపు తెలివితేటలతో  అందరినీ ఆకర్షించింది. చందక సూర్యకుమార్, సబితల రెండో కుమార్తె సాయిసాత్విక. ఆమె డేటా ఎనలైటికల్‌ కోర్సులో ఎమ్మెస్సీ చదవడానికి అమెరికా వెళ్లింది. 

డల్లాస్‌లో తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మిస్‌ తెలుగు యుఎస్‌ఏ–2025’ పోటీల్లో పాల్గొని ఫైనలిస్ట్‌గా నిలిచింది. ఈ నెల 25న డల్లాస్‌లో జరిగిన ఫైనల్‌ పోటీల్లో 22 మంది తెలుగు అమ్మాయిలు పాల్గొనగా అందులో అంకిత రెడ్డి విజేతగా నిలిచింది. రన్నరప్‌ 2గా సాయిసాత్విక ఎంపికైంది. సాయిసాత్విక విజయంపై తల్లిదండ్రులు, అక్క, బావ, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.    

మరచిపోలేని అనుభూతినిచ్చింది 
ఫైనల్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలవడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. అందాల పోటీల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించిన అక్క సాయిసుస్మిత, బావకు రుణపడి ఉంటాను. నాకు ఓటువేసి మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అమెరికాలోని తెలుగు వారికి ధన్యవాదాలు. – సాయిసాత్విక మిస్‌ తెలుగు యూఎస్‌ఏ రన్నరప్‌ –2 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)