Breaking News

నేడు స్థానిక సంస్థల ఎన్నికలు

Published on Mon, 05/19/2025 - 04:30

సాక్షి, అమరావతి: గ్రేటర్‌ విశాఖపట్నంతోపాటు మరో నాలుగు మున్సిపాలిటీలు, రాష్ట్రవ్యాప్తంగా 40 మండలాల్లోని స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేసేందుకు సోమవారం మరో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్‌ వి­శా­ఖపట్నం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్‌ పదవితోపాటు బొబ్బిలి(విజయనగ      రం), ఆదోని (కర్నూలు), తిరువూరు (ఎన్టీఆర్‌), కది­రి (శ్రీ సత్యసాయి) మున్సిపాలిటీల చైర్మన్‌ పద­వులకు, కదిరి మున్సిపాలిటీలో రెండు వైస్‌ చైర్మన్‌ పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నా­యి.

ఇందుకోసం జీవీఎంసీ కార్పొరేషన్, ఆయా మున్సిపాలిటీల్లో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కదిరి మున్సి­పాలిటీలో ముందుగా చైర్మన్‌ పదవికి ఎన్ని­క నిర్వహించి, ఆ తర్వాత వైస్‌ చైర్మన్‌ పదవులకు ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఆ జిల్లా కలెక్టరుకు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఇలా...  
శ్రీ సత్యసాయి జిల్లా గండ్లపెంట, రామగిరి మండలాలతోపాటు పశి్చమ గోదావరి జిల్లా యలమంచిలి, అత్తిలి మండలాల్లో ఎంపీపీ పదవులకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. అత్తిలి(పశి్చమ గోదావరి), కారంపూడి, నరసరావుపేట(పల్నాడు), దగదర్తి(ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు), సర్వకోట(శ్రీకాకుళం), వి.మాడుగల(అనకాపల్లి), దేవరాపల్లి(అనకాపల్లి), కైకలూరు (ఏలూరు), పిట్టలవానిపాలెం(బాపట్ల), దుగ్గిరాల(గుంటూరు), మార్కాపురం, త్రిపురాంతకం (ప్రకాశం), తవనంపల్లి(చిత్తూరు), కంబదూర్‌ (అనంతపురం) మండలాల్లో వైస్‌ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహిస్తారు.

కొత్తవలస (విజయనగరం), చోడవరం (అనకాపల్లి), కడియం (తూర్పు గోదావరి) మండలాల్లో మండల కో–ఆపె్టడ్‌ పదవులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 19 మండలాల్లోని 20 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. పల్నాడు జిల్లాలోనే అత్యధికంగా ఆరు మండలాల్లోని ఏడు పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ పదవులకు ఎన్నికలు ఉన్నాయి. ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈ నెల 20వ తేదీ ఉదయం 11 గంటలకు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నిక కమిషనర్‌ ఆదేశించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)