Breaking News

విశాఖలో వైఎస్‌ జగన్‌.. పోలీసుల ఓవరాక్షన్‌

Published on Thu, 10/09/2025 - 12:21

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. వైఎస్‌ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనాలను పోలీసులు ఆపేశారు. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు.

వివరాల ప్రకారం.. వైఎస్‌ జగన్‌ విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎన్‌ఏడీ జంక్షన్‌ వద్ద కాన్వాయ్‌ వాహనాలను ఆపేసి.. కేవలం నాలుగు వాహనాలను మాత్రమే పోలీసులు అనుమతించారు. నేతల కార్లు, బైకులను అడ్డుకుంటున్నారు. అభిమానంతో వస్తున్న ప్రజలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోనూ పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, వైఎస్‌ జగన్‌ అభిమానులను పోలీసులు అడ్డుకుంటున్నారు. సామాన్య ప్రజలను కూడా పోలీసులు అత్యుత్సాహంతో అడ్డుకుంటున్నారు. అటు, స్థానికంగా ఉన్న షాపులను సైతం పోలీసులు మూయిస్తున్నారు. కార్యకర్తలు, అభిమానులు దూరంగా వెళ్లిపోవాలంటూ పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో, పోలీసుల తీరును అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. 

అనకాపల్లి..
వైఎస్‌ జగన్ పర్యటన సందర్భంగా అనకాపల్లిలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అనకాపల్లి నుంచి నర్సీపట్నం వెళ్లే మార్గంలో ఫ్లెక్సీలు కట్టకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో, వైఎస్సార్‌సీపీ నేతలు పోలీసు తీరుపై ప్రశ్నిస్తున్నారు. పోలీసులపై మండిపడుతున్నరు. కూటమి నేతల ఫ్లెక్సీలు వదిలేసి వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీలనే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పక్షపాతం చూపిస్తున్నారని అంటున్నారు..

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)