Breaking News

‘సార్ అని పిలవాలంటూ మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు’

Published on Tue, 03/25/2025 - 16:13

విశాఖ:  మూడు రోజుల క్రితం అనిల్ అనే స్విగ్గీ డెలివరీ బాయ్ పై ఓ వ్యక్తి అమానుషంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. నగరంలోని ఆక్సిజన్ టవర్ లో డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన అనిల్ అనే యువకుడిపై ప్రసాద్ అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. అయితే ఈ అవమానం భరించలేక అనిల్ ఆత్మహత్యాయత్నం చేసినట్లు కథనాలు రావడంతో డెలివరీ బాయ్స్ సంఘం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. ఆ యువకుడి అండగా నిలబడింది.  ప్రస్తుతం క్షేమంగా ఉన్న ఆ యువకుడు ‘సాక్షి’ కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ఆ రోజు ఏం జరిగిందో వెల్లడించాడు.

‘ అన్నా అనీ పిలిచినందుకు ప్రసాద్ అనే వ్యక్తి నాపై దాడి చేశాడు.  సార్ అని పిలవాలి అంటూ విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.  డ్యూటీలో జాయిన్ మొదట రోజు మొదటి ఆర్డర్ ఆక్సిజన్ టవర్ లో వచ్చింది. నాకు అడ్రస్ తెలియక వెతుక్కొని వెళ్లాను. ఆక్సిజన్ టవర్ లో ఉన్న 29 ఫ్లోర్ కి వెళ్లి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ ఒక యువతి తీసుకున్నారు.  లిఫ్ట్ వద్దకి వచ్చి ప్రసాద్ అనే వ్యక్తి నా పై దాడికి యత్నించిన్నారు

లిఫ్ట్ వద్దకి వచ్చిన ప్రసాద్.. మెట్లపై పరుగెత్తించి దాడి చేశాడు. నా బట్టలు విప్పించి కర్రతో కొట్టారు. నాతో బలవంతంగా రెండు లేటర్లు రాయించారు. నా తప్పు ఉంది అని చెప్పి లెటర్ రాయించారు. నాకు తగిన న్యాయం కావాలి. ప్రసాద్ నన్ను ఎవరు ఎం చెయ్యలేరు అని చెప్పి దాడి చేశారు’ అని పేర్కొన్నాడు బాధితుడు అనిల్‌

 

నిందితుడికి ఏప్రిల్ 7 వరకూ రిమాండ్‌
ఈ దాడిలో నిందితుడిగా ఉన్న ప్రసాద్ కు రిమాండ్ విధించారు. ఏప్రిల్ 7 వ తేదీ వరకూ రిమాండ్ విధించింది కోర్టు. దాంతో  నిందితుడు ప్రసాద్ ను విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)