Breaking News

పట్టణాలతో సమానంగా గ్రామాలు

Published on Sat, 09/21/2024 - 04:25

ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతోంది. ముఖ్యంగా గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమంతో గ్రామీణ ప్రజల జీవన విధానం మెరుగుపడింది. దీంతో రాష్ట్రంలో వినియోగదారుల వ్యయంలో పట్టణాలు, గ్రామాల ప్రజల మధ్య అంతరం తగ్గిపోతోంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారి సౌకర్యాలు పెరగడంతో అభివృద్ధిలో కూడా అంతరం తరిగిపోయి పట్టణాలతో గ్రామాలు పోటీపడుతున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడిస్తోంది. 

వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయం మధ్య అంతరాలను, అసమానతలను ఎస్‌బీఐ నివేదిక విశ్లేíÙంచింది. గ్రామీణ, పట్టణాల మధ్య నెలవారీ తలసరి వినియోగ వ్యయంలో తేడా ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గినట్లు ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక పేర్కొంది. ఈ విషయంలో దేశంలో ఏపీ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిపింది.

దీనివల్ల రాష్ట్రంలో గ్రామీణ, పట్టణాల మధ్య అసమానతలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. దేశంలో 2009–10లో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య తలసరి వ్యయం వ్యత్యాసం 88.2 శాతం ఉండగా 2022–23 నాటికి  71.2 శాతానికి తగ్గినట్లు తెలిపింది. 2029–30 నాటికి ఇది 65.1 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. – సాక్షి, అమరావతి
 
దేవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తల­సరి వినియోగ వ్యయం రూ.6,459 ఉండగా, గ్రా­మీ­ణ ప్రాంతాల్లో రూ. 3,773 ఉన్న­ట్లు వివరించింది. రాష్ట్రంలో 2022–23 నాటికి పట్ట­ణా­లు, గ్రామాల మధ్య నెల­వారీ తలసరి వినియోగ వ్య­యంలో అంతరం 39.3 శాత­మే­నని తెలిపింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నెలవారీ తలసరి వినియోగ వ్యయం రూ. రూ. 6,782 ఉండగా, గ్రామీణ ప్రాంతా­ల్లో రూ. 4,870 ఉన్న­ట్లు పే­ర్కొంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న దిగువ, మధ్య తర­గతి జనాభా ఆదాయాలు మెరుగుపడటం వల్ల నెల­వారీ తలసరి వ్యయంలో అంతరాలు భారీగా తగ్గినట్లు పేర్కొంది. 

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద లబి్ధదారులకు వివిధ పథకాల ద్వారా నేరుగా నగదు బదిలీ చేయడంతో జీవన విధానంలో స్పష్టమైన మా­ర్పు కనిపిస్తోందని నివేదిక వివరించింది. గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం వల్ల కూడా గ్రామీణ ప్రజల ఆదాయం పెరగడంతో పాటు నెలవారీ తలసరి  వ్యయం పెరుగుతోందని తెలిపింది. దీంతో పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గిపోతున్నాయని నివేదిక పేర్కొంది. రైతుల ఆదాయా­న్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం వల్ల కూడా గ్రామీణ జీవనం గణనీయంగా మెరుగుపడినట్లు నివేదిక తెలిపింది. 

2011–­12­తో పోల్చి చూస్తే 2022–23­లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఏపీ­లో అసమానతలు గణనీయంగా తగ్గి­నట్లు నివేదిక పేర్కొంది. అదే ఛత్తీ­స్‌­­గఢ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో అసమానతలు పెరిగినట్లు నివేదిక తెలిపింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒడి­శా, తమిళనాడు, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసమనాతలు పెరగ్గా మిగిలిన అన్ని రాష్ట్రాల్లో అసమానతలు తగ్గినట్లు నివేదిక పేర్కొంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)