Breaking News

యురేనియం.. ఆందోళన ఉగ్రరూపం

Published on Tue, 11/12/2024 - 05:37

కర్నూలు(సెంట్రల్‌): కర్నూలు కలెక్టరేట్‌ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు పోలీసుల అడ్డగింపు..మరోవైపు యురేనియం బాధిత గ్రామాల ప్రజల ఆందోళనతో అట్టుడికింది. దేనకొండ మండలం కప్పట్రాళ్ల పరిసరాల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలు చేపట్టబోమని కలెక్టర్‌ వచ్చి ప్రకటన చేయాలని 15 గ్రామాల ప్రజలు కలెక్టరేట్‌ ఎదుట ఆందోళనకు దిగారు. తమ గ్రామాలను పరిరక్షించాలని, తాము నమ్ముకొని ఉన్న భూములు, ఇళ్ల సమీపంలో యురేనియం తవ్వకాలు చేపడితే తమ గతి ఏమిటని, వచ్చే రోగాలకు బాధితులెవరని, పంటలు పండే భూములు బీడుగా మారితే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని ప్రశి్నస్తూ 5 గంటల పాటు కలెక్టరేట్‌ను ముట్టడించారు. పోలీసులు ఎంతచెప్పినా ఆందోళనను విరమించలేదు.

తమకు కలెక్టర్‌ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబట్టారు. అయితే కలెక్టర్‌ తనకు బదులుగా డీఆర్వో సి.వెంకటనారాయణమ్మను మొదట పంపారు. ఆమె కలెక్టర్‌ తరపున వివరణ ఇచ్చేందుకు ప్రయత్నిస్తే వారు ఒప్పుకోలేదు. కలెక్టరే రావాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. చివరకు కలెక్టర్‌కు బదులుగా జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ బి.నవ్య ఆందోళనకారుల దగ్గరకు వచ్చారు. అందరూ ఏక కంఠంతో యురేనియం తవ్వకాలు ఆపాలని నినదించారు.

తమ గ్రామాలను కాపాడాలని అభ్యరి్థంచారు. యురేనియం తవ్వకాలు చేపడితే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని, అధికారులే తమకు న్యాయం చేయాలని కోరడంతో జేసీ స్పందిస్తూ...ప్రస్తుతానికి ఆందోళన అక్కర్లేదని, కేంద్ర పర్యావరణ అనుమతులు రాలేదని, అప్పటివరకు యురేనియం తవ్వకాల నిర్థారణ కోసం గాని, యురేనియం తవ్వకాలు కాని చేపట్టబోమని చెప్పారు. అయితే అనుమతులు రాగానే గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తారని, అప్పుడు అభ్యంతరాలను ప్రజలు తెలుపవచ్చని సూచించారు.

జేసీ ప్రసంగానికి అడ్డంకులు
జేసీ డాక్టర్‌ నవ్య ప్రసంగానికి కొందరు యువకులు అడ్డు తగిలారు. తాము అసలు యురేనియం తవ్వకాలపై ఎలాంటి ముందడుగు వేయడానికి వీలు లేదంటే అనుమ­తులు వచి్చన తరువాత గ్రామసభలు పెడతామని ఎలా మాట్లాడుతారని జేసీని ప్రశి్నంచారు. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని వారించారు. మరోవైపు ఆందోళనలో చురుగ్గా ఉన్న యువకుల వివరాలను పోలీసులు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలను కాపాడడంలో భాగంగా ముందుగా జాగ్రత్తగా తీసుకొని ఉంటారని ఆమె వివరించారు.

 మొత్తంగా జేసీ వివరణతో తరువాత కప్పట్రాళ్ల చుట్టుపక్కల యురేనియం తవ్వకాలు చేపడతారని స్పష్టంగా అర్థమైపోయింది. కాగా, ప్రజలు ఎంత కోరినా కలెక్టర్‌ మాత్రం బయటకు రాకపోవడంతో గమనార్హం. ఆందోళనకు సీపీఎం నేతలు జి.రామకృష్ణ, పి.నిర్మల, పీఎస్‌ రాధాకృష్ణ, వీరశేఖర్‌ మద్దతు తెలిపారు. కార్యక్రమంలో కప్పట్రాళ్ల, కోటకొండ, బేతపల్లి, నెల్లిబండ, గుడిమిరాళ్ల, బంటుపళ్లి, గుండ్లకొండ తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)