Breaking News

రీ సర్వేను బహిష్కరిస్తాం

Published on Mon, 01/26/2026 - 04:03

తిరుపతి అర్బన్‌: గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 27 నుంచి భూముల రీ సర్వేను బహిష్కరిస్తామని గ్రామ సర్వేయర్ల అసోసియేషన్‌ హెచ్చరించింది. సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఆందోళనలకైనా సిద్ధమని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఆదివారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో మహాప్రస్థానం పేరిట రాష్ట్రస్థాయిలో గ్రామ సర్వేయర్ల సమావేశం జరిగింది. అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధుబాబు మాట్లాడుతూ.. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని పరిష్కారం చూపాలనిడిమాండ్‌ చేశారు. 

లేదంటే పోరాటాలకు వెనుకాడేది లేదని తేల్చి చెప్పారు. నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నా చిన్నచిన్న సాకులు చూపిస్తూ పదేపదే మెమోలు, షోకాజ్‌ నోటీసులు జారీ చేయడమే కాకుండా సస్పెన్షన్‌ విధించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రీసర్వే విధుల్లో ఉంటున్న గ్రామ సర్వేయర్ల ప్రయాణ భత్యం, కరువు భత్యం, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. 

అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఎం.మహేష్‌నాయుడు మాట్లాడుతూ.. జాబ్‌ చార్టులకు విరుద్ధంగా జాయింట్‌ ఖాతాల తొలగింపు, పట్టాదారులను నిర్ణయించడం తదితర కీలక అంశాలు రెవెన్యూ అధికారులు చేయాల్సి ఉంటే బలవంతంగా సర్వేయర్లపై రుద్దడం తగదన్నారు. లాప్‌టాప్‌లు, రోవర్లు, స్టేషనరీ సరిపడినంతగా సరఫరా చేయకుండా ఇక్కట్లకు గురిచేస్తున్నారని వెల్లడించారు. 

రేషనలైజేషన్‌ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలో 4,722 మంది గ్రామ సర్వేయర్లను సర్వే సంబంధిత శాఖల్లో కౌన్సెలింగ్‌ విధానంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రేడ్‌–1కి సంబంధించి పదోన్నతులు 70శాతం ఇవ్వాల్సి ఉందని గుర్తుచేశారు. ఐదేళ్ల సర్వే పూర్తి చేసుకున్న వారికి కనీస బేసిక్‌ రూ.32 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Videos

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)