Breaking News

చర్లపల్లి–కాకినాడ టౌన్, నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక రైళ్లు

Published on Fri, 02/28/2025 - 05:32

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): ప్రయాణికుల రద్ది దృష్ట్యా విజయవాడ మీదుగా చర్లపల్లి–కాకినాడ టౌన్, చర్లపల్లి–నర్సాపూర్‌ మధ్య ప్రత్యేక వారాంతపు రైళ్లు నడపనున్నట్లు విజయవాడ డివిజన్‌ పీఆర్‌వో నుస్రత్‌ మండ్రుప్కర్‌ గురువారం తెలిపారు. చర్లపల్లి–కాకినాడ టౌన్‌ ప్రత్యేక రైలు (07031) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 7.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07032) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో సాయంత్రం 6.55 గంటలకు కాకినాడ టౌన్‌లో బయలుదేరుతుంది. 

రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్‌ల్లో ఆగుతుంది. అలాగే, చర్లపల్లి–నర్సాపూర్‌ ప్రత్యేక రైలు (07233) ఈ నెల 28, మార్చి 7, 13, 21, 28 తేదీల్లో రాత్రి 8.15 గంటలకు చర్లపల్లిలో బయలుదేరుతుంది. 

తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07234) మార్చి 2, 9, 16, 23, 31 తేదీల్లో రాత్రి 8గంటలకు నర్సాపూర్‌లో బయలుదేరుతుంది. రెండు మార్గాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, వీరవాసరం, పాలకొల్లు స్టేషన్‌ల్లో ఆగుతుంది. 

విజయవాడ మీదుగా పలు రైళ్లు రద్దు 
కడియం–ద్వారపూడి–అనపర్తి సెక్షన్‌ల్లో జరుగుతోన్న నాన్‌ ఇంటర్‌లాక్‌ పనుల కారణంగా ఆయా మార్గాల్లో నడిచే పలు రైళ్లను రైల్వేశాఖ రద్దు చేసింది. మార్చి 1, 2 తేదీల్లో గుంటూరు–విశాఖ (17239/17240), మార్చి 2న విశాఖ–గుంటూరు (22701/22702), విశాఖ–లింగంపల్లి (12805), 3న లింగంపల్లి–విశాఖ (12806) రైళ్లను రద్దు చేసింది.  

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)