Breaking News

అల్లూరే అందరికీ స్ఫూర్తి

Published on Wed, 07/05/2023 - 04:58

సాక్షి,అమరావతి: బ్రిటీష్‌ వలస పాలకులకు వ్యతి­రేకంగా, ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో–ఆర్డినేటర్, జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి కొనియాడారు.  ఇంతటి ఘనచరిత్ర కలిగిన స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరిని తరతరాలవారు స్మరించుకునేలా, సీఎం వైఎస్‌ జగన్‌ ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టా రని చెప్పారు.

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విజయసాయిరెడ్డి ప్రసంగిస్తూ అల్లూరి స్ఫూర్తితో, ఆదివాసీల హక్కుల్ని కాపాడటంలోనూ, వారికి అన్నిరకాలుగా అండదండలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు.

గిరిజనులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశామని, వారి ఆధీనంలోని పోడు భూముల వ్యవసాయాన్ని ఎవరూ ఆటంకపరచకుండా వ్యవసాయ పట్టాల్ని ఇచ్చామని వివరించారు. శాసన మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మాట్లాడుతూ అల్లూరి జయంతి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, వరుదు కల్యాణి, మొండితోక అరుణ్‌కుమార్, పార్టీ ఎస్టీ విభాగ అధ్యక్షుడు హనుమంతు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి