Breaking News

ఔను.. ఒంటరి మహిళ నుంచి డబ్బు తీసుకున్నా

Published on Fri, 11/28/2025 - 05:03

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉద్యోగం ఇప్పిస్తానని పార్వతీపురం మన్యం జిల్లా సాలూ­రుకు చెందిన ఒంటరి మహిళను ఆర్థికంగా దోచుకుని, తర్వాత లైంగికంగానూ వేధించిన మంత్రి అనధికారిక పీఏ సతీష్‌ నిజం ఒప్పుకొన్నాడు. అతడి ఆగడాలను.. ‘‘మంత్రి కొడుక్కి నీపై మనసైంది’’ శీర్షికన గురువారం ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. దీంతో తన దుర్మార్గాన్ని సమర్థించుకునే క్రమంలో సతీష్‌ వాస్తవాన్ని చెప్పేశాడు. బాధిత మహిళ నుంచి తాను డబ్బు తీసుకున్నది నిజమేనని అంగీకరించాడు. అది అప్పుగా మాత్రమేనని బుకాయించాడు.

అయితే, భర్త చనిపోయి.. తీవ్ర అనా­రో­గ్యం పీడితురాలైన బిడ్డతో.. కారుణ్య ఉద్యోగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళ నుంచి సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అనుచరుడు అప్పు తీసుకున్నానని చెప్పడంతోనే అతడి వాదన డొల్ల అని స్పష్టమైంది. మరోవైపు బాధిత మహిళతో పాటు ఆమె పక్షాన నిలిచిన ‘సాక్షి’పై కేసులు పెడతామని సతీష్‌ బెదిరింపులకు దిగాడు. అధికారం అండతో అనధికారిక పీఏగా ఉంటూ.. మహిళను వేధించింది కాక మరింత బరితెగించాడు.

డబ్బు దండుకున్నది కాక మానప్రాణాలతో చెలగాటం
‘‘ఆడబిడ్డకు అన్యాయం జరిగితే, అండగా నిలవాల్సిన మహిళా మంత్రే నిందితుడిని వెనకేసుకొస్తున్నారు. ఉద్యోగం పేరుతో డబ్బు దండుకున్నది కాక మానప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని బాధిత మహిళ వాపోయింది. మంత్రి అనధికారిక పీఏ సతీష్‌ ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని ఐద్వా, శ్రామిక మహిళా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)