Breaking News

పన్ను ఎగవేసే కంపెనీల్లో విజిలెన్స్‌ తనిఖీలు చేయొచ్చు

Published on Sun, 05/07/2023 - 09:10

సాక్షి, అమరావతి : రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పరిధిపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే, పన్ను ఎగవేతకు పాల్పడే వ్యాపార సంస్థలు, కంపెనీల్లో తనిఖీ చేసే అధికారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌­మెంట్‌కు ఉందని తీర్పునిచ్చింది. జీఎస్‌టీ చట్టం కింద రిజిస్టర్‌ అయిన కంపెనీలు, వ్యాపార  సంస్థల్లో కూడా తనిఖీలు చేసే అధికారం కూడా ఈ విభాగానికి ఉందని తేల్చి చెప్పింది. ట్యాక్స్‌ డిపా­ర్ట్‌మెంట్‌ సైతం విజిలెన్స్‌ పరిధిలోకి వస్తుందని స్పష్టం చేసింది.

తమ కంపెనీలో తనిఖీలు చేసి, అమ్మకాల టర్నోవర్‌ను తగ్గించి చూపినట్లు పేర్కొంటూ విజిలెన్స్‌ అధికారులు జీఎస్‌టీ అధికారులకు అలర్ట్‌ నోట్‌ పంపడం జీఎస్‌టీ చట్ట నిబంధనలకు విరుద్ధమంటూ కర్నూలుకు చెందిన సుధాకర్‌ ట్రేడర్స్‌ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.  అయితే, విజిలెన్స్‌ అలర్ట్‌ నోట్‌ ఆధారంగా సుధాకర్‌ ట్రేడర్స్‌ వివరణ కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్‌ జారీ చేసిన నోటీసులను రద్దు చేసింది. జీఎస్‌టీ చట్టం ప్రకారం చీఫ్‌ కమిషనర్‌ లేదా అతని నుంచి ఆథరైజేషన్‌ పొందిన అధికారికి మాత్రమే నోటీసులు జారీ చేసే అధికారం ఉందని తెలిపింది.

తిరిగి చీఫ్‌ కమిషనర్‌ లేదా అతని ఆథరైజేషన్‌ పొందిన అధికారులు సుధాకర్‌ ట్రేడర్స్‌కు నోటీసులు జారీ చేసి, వారి వివరణ తీసుకొని, ఆ తరువాత చట్ట ప్రకారం తగిన ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ జ్యోతిర్మయి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

సమాచార మార్పిడిలో తప్పు లేదు 
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశాలపై విచారణ, దర్యాప్తు చేయడం, ప్రభుత్వ ఆదాయ వనరులకు గండికొట్టే వారిపై చర్యలు తీసుకోవడం తదితర లక్ష్యాలతో విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏర్పాటైందని తెలిపింది. అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, మునిసిపాలిటీలు, జెడ్పీలు విజిలెన్స్‌ పరిధిలోకి వస్తాయంది. పన్ను ఎగవేతను అడ్డుకునేందుకు రెండు శాఖల మధ్య సమాచార మార్పిడిలో ఎలాంటి తప్పూ లేదని స్పష్టం చేసింది.

అలెర్ట్‌ నోట్‌ ఆధారంగా నోటీసులివ్వడం చట్ట విరుద్ధం 
ఐరన్, స్టీల్‌ వ్యాపారం చేసే సుధాకర్‌ ట్రేడ­ర్స్‌లో విజిలెన్స్‌ అధికారులు 2022 సంవత్స­రంలో తనిఖీలు చేశారు. అమ్మకాల టర్నోవ­ర్‌ను తక్కువ చేసి చూపారని వాణిజ్య పన్ను­ల శాఖ అధికారులకు అలర్ట్‌ నోట్‌ పంపారు. దీని ఆధారంగా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూ­టీ కమిషనర్‌ సుధాకర్‌ ట్రేడర్స్‌కు నోటీసులు పంపి, వివరణ కోరారు. దీనిపై సంç­Ü్థ యజమాని ఎస్‌.సుధాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫున  సీనియర్‌ న్యాయవాది ఎంవీకే మూర్తి వాదనలు వినిపిస్తూ.. జీఎస్‌టీ చట్టం కింద రిజిస్ట­ర్‌ అయిన డీలర్‌కు చెందిన సంస్థల్లో తనిఖీ­లు చేసే అధికారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు లేదన్నారు.

అందువల్ల విజిలెన్స్‌ అలర్ట్‌ నోట్‌ ఆధారంగా డిప్యూటీ కమిషనర్‌ ఇచ్చిన నోటీసులు చెల్లవన్నారు. హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహే­శ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రభు­త్వ ఆదాయానికి గండికొట్టే వారి విషయంలో స్పందించే అధికారం విజిలెన్స్‌కు ఉందన్నా­రు. సుధాకర్‌ ట్రేడర్స్‌లో స్టాక్‌లో తేడాలున్నాయని, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చే­సినట్లు గుర్తించామన్నారు. దీంతో వా­­ణిజ్య పన్నుల శాఖ అధికారులకు అలర్ట్‌ నోట్‌ పంపి, పన్ను ఎగవేతను అడ్డుకోవాలని కోరామన్నారు. వాణిజ్య పన్నుల శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపిస్తూ, రిటరŠన్స్‌లో లోపాలుంటే వాటిపై వివరణ ఇవ్వాలంటూ నోటీ­సు­లు జారీ చేసే అధికారం తమకుందన్నారు.

Videos

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)