Breaking News

ఈ ఆంజనేయుడు... రావణుడు

Published on Tue, 04/08/2025 - 05:45

సాక్షి, అమరావతి: విజయ డెయిరీ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు లైంగిక నేరాలకు పాల్పడుతు­న్నాడంటూ ఓ మహిళ సోమవారం తీవ్ర ఆరోపణలు చేశారు. స్పా సెంటర్లు, పబ్‌ల పేరుతో ఆయన సాగిస్తున్న దారుణాలను కళ్లకు కట్టినట్టు చెప్పారు. తనకు న్యాయం చేయాల్సిందిగా సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత, మంత్రి లోకేశ్‌ను వేడుకున్నారు. ‘పదవి కోసం నాతోపాటు అనేకమంది మహిళల జీవితాలను చలసాని ఆంజనేయులు నాశనం చేస్తున్నాడు.

డబ్బు ఆశ చూపి ఒంటరి మహిళలను నరక కూపాల్లోకి నెడుతున్నాడు. నేనూ ఓ బాధితురాలినే’ అని కన్నీరు పెడుతూ మీడియాకు విడుదల చేసిన వీడియో రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బాధితురాలు ఏమన్నారంటే.. ‘‘నా పేరు కొడాలి ప్రమీల. మాది బాపుల­పాడు గ్రామం. ఇద్దరు ఆడపిల్లలున్నారు. 2019­లో నా భర్త చనిపోయాడు. తెలిసిన రిపోర్టర్‌ ద్వారా ఉద్యోగం కోసం ఆంజనేయులు వద్దకు  వెళ్లాను. విజయవాడలో పాల ఫ్యాక్టరీలో పెట్టా­రు. 

కొన్ని రోజులకు  స్వీట్ల తయారీకి మార్చా­రు. దేవుడు అనుకున్న ఆంజనేయులు నిజ స్వరూపం అప్పుడు బయటపడింది. ఆడవాళ్లను చూస్తే అతడు పిచ్చెక్కిపోయి సైకోలా ప్రవర్తి­స్తుంటాడు. భర్త లేడు కదా, అప్పులున్నాయి కదా, ఆర్థికంగా ఆదుకుంటానని నమ్మించి నన్ను లొంగదీసు­కున్నాడు. కొన్నాళ్లు మేం సహజీవనం చేశాం. 

⇒ 2022 ఫిబ్రవరి 7న నన్ను క్యాబిన్‌కు పిలిచాడు. హైదరాబాద్, విశాఖలో పబ్‌లు పెడుతున్నా­మని, అక్కడికి డబ్బున్న మగవాళ్లు వస్తారని, వారికి అమ్మాయిలతో అవసరాలు ఉంటాయని అప్పుల పాలైన వాళ్లు, ఒంటరి మహిళలు ఉంటే చూడమని కోరాడు. ఆంజనేయులు ఆడపిల్లలను అడ్డుపెట్టుకుని చాలా దారుణమైన పనులు చేస్తున్నాడు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ఆఫీసర్ల వద్దకు తీసుకెళ్తున్నాడు. మాట విననివారిపై దొంగతనం నెపం నెట్టి ఉద్యోగం నుంచి తీసేస్తాడు. నన్నూ అలానే పంపించేశాడు. మూడు రోజులు గదిలో బంధించి, చిత్రహింసలు పెట్టాడు. మూడు నెలల క్రితమే నేను వచ్చేసినా వదలడం లేదు. మేనేజర్‌ యశ్వంత్‌తో ఫోన్‌ చేయిస్తు­న్నాడు అమ్మాయిల­ను పంపమని వేధిస్తున్నాడు.

⇒ హైదరాబాద్, విశాఖల్లో ఆంజనేయులుకు మసాజ్‌ సెంటర్లు, పబ్‌లు ఉన్నాయి. డబ్బు ఎరవేసి అమ్మాయిలను అందులో పెడుతున్నాడు. వేమూరి సాయి, చలసాని చక్రపాణి, యాసిన్, పాలగుల నాని వంటి చాలామందికి ఈ విషయం తెలుసు. వీరందరినీ కఠినంగా శిక్షించాలి. నాలాంటి బాధిత మహిళలు చాలామంది ఉన్నారు. చెప్పుకోలేక కుంగిపోతున్నారు. నేను వాటిని భరించలేక ఏమైపోయినా పర్లేదని బయటకు వచ్చాను.  న్యాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నా.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)