Breaking News

ప్రభుత్వానిది నియంతృత్వ ధోరణి అనడం దుర్మార్గం

Published on Fri, 05/10/2024 - 04:05

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ సూర్య­నారాయణ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (ఏపీజీఈఎఫ్‌) చైర్మన్‌ కె.వెంకటరామిరెడ్డి ఖండించారు. ప్రభుత్వా­నిది నియంతృత్వ ధోరణి అనడం, నియంతపాలన అనడం దుర్మార్గమని పేర్కొన్నారు.

ఈ మేరకు వెంకటరామిరెడ్డి గురువారం చేసిన ప్రకటనలో వెంకటరామిరెడ్డి ఇంకా ఏమని పేర్కొన్నారంటే.. 2014–19 మధ్య ఉద్యోగులపై వందల సంఖ్యలో ఏసీబీ ద్వారా డీఏ  కేసులు పెట్టడం  నిజం కాదా? అందులో మూడు, నాలుగు కులాలకు చెందినవారే 70 శాతానికిపైగా ఉండటం వాస్తవం కాదా? కక్షసాధింపులో భాగంగానే ఈ కేసులన్నీ పెట్టారు కాబట్టి వీటన్నింటినీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి వాటిమీద కమిటీని వేయించింది గుర్తులేదా? ఈ ఐదేళ్లలో డీఏ కేసులతో ఎవరినైనా వేధించారా? గతంలో ఒక మహిళా ఉద్యోగిని పట్టపగలు జుట్టుపట్టుకుని ఈడ్చికొడితే కనీసం కేసు పెట్టారా?

కరోనా సమయంలో వైద్యా­రో­గ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు పని ఒత్తిడిలో ఉద్యోగులను పరుషంగా మాట్లాడితే ఆయన తరఫున ఉద్యోగులకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పడం వాస్తవం కాదా? అసలు గతంలో ఏనాడైనా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాలు పెట్టారా? ఇప్పుడు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి నిజం కాదా? కళ్లముందు ఇన్ని వాస్తవాలు కనపడుతుంటే సూర్యనారాయణ ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నారో ఉద్యోగులు గమనించాలి. సమస్యలపై పోరాటం పేరుతో అబద్ధాల ప్రచారం సరికాదు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)