Breaking News

డప్పు కొట్టి చెబుతున్నా!

Published on Mon, 07/24/2023 - 05:17

  • రాజులేలిన గడ్డపై జరిగే జాతరకు రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట స్థానం కల్పించింది. భక్తులు, స్థానికుల మనోభావాలకు అధిక ప్రాధాన్యమిచ్చింది. వెంకటగిరి రాజాల ఆకాంక్షను నెరవేర్చింది. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు మెండుగా ఉండాలని సంకల్పించింది. ఈమేరకు నేతన్న నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

వెంకటగిరి(తిరుపతి జిల్లా): వెంకటగిరి పోలేరమ్మ తల్లి జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఏడాది కొకసారి జరిగే జాతరలో పోలేరమ్మను దర్శించుకుంటే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. వెంకటగిరి సంస్థాన రాజులు ఏలుతున్న రోజులవి. 1917లో వెంకటగిరిలో కలరా మహమ్మారి వందలాది మందిని బలితీసుకుంది. ఈ క్రమంలో వెంకటగిరి సంస్థానాధీశులు భారీ ఎత్తున శీతలయాగం నిర్వహించారు. మరోవైపు వెంకటగిరి నలువైపులా పొలిమేరలో గ్రామశిలలను ఏర్పాటు చేసి క్రమం తప్పకుండా జాతర నిర్వహించారు. అప్పటి నుంచి వెంకటగిరి జాతర జరుగు­తూనే వస్తోంది. వెంకటగిరి సంస్థానాధీశుల ఆధీనంలో జరుగుతున్న పోలేరమ్మజాతర 1992 నుంచి దేవదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 

అరుదైన వేదిక
వెంకటగిరి పోలేరమ్మజాతర నిమ్నవర్గాలతోపాటు జానపద కళారూపాల ప్రదర్శనకు అరుదైన వేదికగా నిలుస్తోంది. మతాలకు అతీతంగా వెంకటగిరీయులు నిర్వహించుకుంటారు. ఈ జాతరలో నిమ్నవర్గాలకు చెందిన వ్యక్తులు ముందుండి జాతరను నిర్వహిస్తారు. రాష్ట్రంలోనే ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ జాతరకు దేశవిదేశాల్లో ఉన్న వెంకటగిరీయులే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తుంటారు. జాతరకు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే ఆ ఏడాది అంతా పోలేరమ్మతల్లి ఆశీస్సులు ఉంటాయని భక్తుల విశ్వాసం. 

నెరవేరిన కల
వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగా నిర్వహించాలనే స్థానికుల కల నెరవేరింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంకటగిరిలో నేతన్ననేస్తం ఐదో విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పోలేరమ్మ జాతరను వెంకటగిరీ­యుల ఆకాంక్ష మేరకు రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు జీవో విడుదల చేస్తామని ప్రటించారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)