Breaking News

ఇదేనా ‘దూర’దృష్టి!

Published on Sun, 08/18/2024 - 05:40

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాక్‌ ర్యాంకింగ్‌తో ఆంధ్రా యూని­వర్సిటీని అగ్రస్థానంలో నిలబెట్టగా.. ఇప్పుడు సొంత బాకా కొట్టుకునేందుకే అన్నట్టుగా మార్చే­శారు. ఏయూలో ఎంఏ జర్నలిజం దూరవిద్య పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలో ఏయూ వీసీ శశిభూషణరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందేందుకు టీడీపీ కరపత్రికగా ఉన్న ఈనాడు గురించి ప్రశ్నలు సంధించారు.

వీసీ, ఏయూ అధికారుల వ్యవహారంపై విద్యార్థులు నిర్ఘాంతపోయారు. హిస్టరీ ఆఫ్‌ మాస్‌ మీడియా పరీక్ష ప్రశ్నపత్రంలో విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. సెక్షన్‌–ఏ లో మొదటి ప్రశ్నలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. ఇందులో ఎనిమిది టాపిక్స్‌ ఇవ్వగా.. అందులో ఏడు మాత్రం సిలబస్‌లో ఉన్నవే ఇచ్చారు. కానీ.. సిలబస్‌లో లేని ‘ఈనాడు’ గురించి కూడా రాయాలంటూ ప్రశ్నపత్రంలో ఇవ్వడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈనాడు గురించి సిలబస్‌లో ఉంటే కచ్చితంగా ప్రశ్న ఇచ్చినా ప్రిపేరై రాసేవాళ్లమని.. కానీ, ఎక్కడాలేని ప్రశ్నని ఇస్తే.. తాము ఎలా రాస్తామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎనిమిదింటిలో నాలుగు ప్రశ్నలు మాత్రమే తెలుసనీ.. ఈనాడు బదులు సిలబస్‌లో ఉన్నది ఇచ్చి ఉంటే మరో ప్రశ్న కూడా రాసేవాళ్లమని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకే వైస్‌ చాన్సలర్‌ ఈ విధంగా ప్రశ్నపత్రం తయారు చేయించి ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరీక్షలో ఇంకెవరి గురించి రాయమని ప్రశ్నపత్నం తయారు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)