కనుడు కనుడు రామాయణ గాథ

Published on Mon, 09/30/2024 - 04:44

విజయనగరం రూరల్‌: రామాయణంలోని మానవత్వ విలువలను భావితరాలకు అందించడం కోసం ప్రముఖ వ్యాపారవేత్త నారాయణం నరసింహమూర్తి పన్నెండేళ్ల క్రితం బృహత్‌ సంకల్పం చేసి శ్రీరామనారాయణం ప్రాంగణం నెలకొల్పారు. నరసింహమూర్తి మొదటినుంచీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. నరసింహమూర్తి మరణాంతరం ఆయన సంకల్పానికి తోడుగా వాల్మికి రామాయణంలోని వివిధ కోణాలపై పరిశోధనల్ని ప్రోత్సహించడంతోపాటు రామాయణాన్ని భావితరాల జీవన మార్గంగా మలిచేందుకు ఆయన కుటుంబ సభ్యులు శ్రీవాల్మికి రామాయణ రీసెర్చ్‌ సెంటర్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇప్పటివరకూ శ్రీరామనారాయణం ఒక ఆధ్యాతి్మక కేంద్రం మాత్రమే. వాల్మికి రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటుతో రామాయణంపై పరిశోధనలకు మరో అడుగు ముందుకు పడింది.

12 వేల గ్రంథాలు ఏర్పాటు 
వాల్మికి రామాయణం రీసెర్చ్‌ కేంద్రంలో రామాయణానికి సంబంధించిన 12 వేల గ్రంథాలను అందుబాటులో ఉంచారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్యను లక్షకు పైగా పెంచే ఆలోచనతో ఉన్నామని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ గ్రంథాలు తెలుగు, హిందీ, సంస్కృతం, ఆంగ్లంతో పాటు ఇతర ప్రముఖ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు, యువత, ఆధ్యాతి్మక వేత్తలు, పండితులు, ప్రవచనకర్తలు, గురూజీలు, నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలుగా రీసెర్చ్‌ కేంద్రంలోనే ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పీహెచ్‌డీ చేసే వారికి ఈ కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని నరసింహమూర్తి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

యువత రావాలి 
ఈ కేంద్రానికి ప్రధానంగా యువత ముందుకు వచ్చి రీసెర్చ్‌ చేయాలి. రామాయణం ప్రబోధించే విలువలు, సీతారాముల కథను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి. ఇంతటి అద్భుతమైన కేంద్రాన్ని ప్రారంభించి సమాజానికి అవకాశం కలి్పంచిన నారాయణం కుటుంబ సభ్యులు అభినందనీయులు. ప్రతి ఒక్కరూ ఈ కేంద్రాన్ని సందర్శించి జీవన మార్గాన్ని సుగమం చేసుకోవాలి. – డాక్టర్‌ ఎస్‌.వైష్ణవి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి 

పూర్వజన్మ సుకృతం
మా తండ్రి ఆశయం మేరకు శ్రీరామనారాయణం ప్రాంగణంలో వాల్మీకి రీసెర్చ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. దేశంలో పలు మార్గాల్లో ఉన్న ఆధ్యాత్మిక గురువుల సలహాలు, ఆశీస్సులతో ఈ కేంద్రం ఏర్పాటుచేసి సమాజ శ్రేయస్సుకు మా వంతు కృషి చేస్తున్నాం  – నారాయణం శ్రీనివాస్, ఫౌండర్, శ్రీరామనారాయణం ప్రాంగణం

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)