Breaking News

వంశీ ఆరోగ్యం అసలు బాగోలేదు: భార్య పంకజశ్రీ

Published on Fri, 05/16/2025 - 16:09

సాక్షి, ఏలూరు జిల్లా: తన భర్త ఆరోగ్యం అసలు బాగోలేదని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ అన్నారు. కిటోన్‌ శాంపిల్స్ పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. బరువు కూడా తగ్గిపోయారని.. వంశీ ఆరోగ్యంపై తమకు తీవ్ర ఆందోళనగా ఉందని తెలిపారు. లాయర్‌ చిరంజీవి మాట్లాడుతూ.. వంశీపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. పాత కేసులను తిరగదోడి కావాలనే ఇబ్బందిపెడుతున్నారన్నారు. పిటీ వారెంట్ దాఖలులో నిబంధనలు ఫాలో కాలేదని చిరంజీవి  అన్నారు

వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు.. 14 రోజుల రిమాండ్‌ను విధించింది. హనుమాన్‌ జంక్షన్ పోలీసుల పీటీ వారెంట్‌తో వంశీకి రిమాండ్‌ విధించింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులతో అధికార కూటమి ప్రభుత్వం వేధింపుల పరంపరను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆయనపై పలు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేయటంతో గత 90 రోజులకుపైగా వంశీ విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

ఇప్పటి వరకు ఆయనను అరెస్ట్‌ చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్‌ మంజూరు చేయటంతో తాజాగా హనుమాన్‌జంక్షన్‌ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారంట్‌ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు.
 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)