Breaking News

కుగ్రామంలో వికసించిన మరో ‘పద్మం’

Published on Mon, 01/26/2026 - 04:38

మోపిదేవి/గుడ్లవల్లేరు: పండితులు, విద్వాంసులకు నిలయమైన టేకుపల్లి గ్రామంలో మరో ‘పద్మం’ వికసించింది. వెంపటి కుటుంబ శాస్త్రి(V Kutumba Sastry)కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంతో కృష్ణాజిల్లాలోని ఈ గ్రామం మరోసారి వార్తల్లోకి వచ్చింది. మండలంలోని టేకుపల్లిలో వెంపటి జగన్నాథం, రాజ్యలక్ష్మి దంపతుల ఆరుగురు కుమారుల్లో ఒకరు కుటుంబశాస్త్రి. సంస్కృతంలో దిట్ట. ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ సంస్కృత విశ్వవిద్యాలయాలు న్యూఢిల్లీ రా్రïÙ్టయ సంస్కృత సంస్థాన్, వారణాసి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం, గుజరాత్‌ శ్రీ సోమనాథ్‌ సంస్కృత విశ్వవిద్యాలయాలకు ఉప కులపతి (వైస్‌ చాన్స్‌లర్‌)గా కుటుంబశాస్త్రి పనిచేశారు.

తిరుమల సంస్కృత విశ్వవిద్యాలయ వీసీగా కూడా పనిచేశారు. భండార్కర్‌ ఓరియంటల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పీఠంలో తొలి ఆచార్యుడిగా పనిచేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిగా మురళీమనోహర్‌ జోషి ఉన్న సమయంలో సంస్కృత సంబంధమైన అనేక పదవులను అలంకరించారు. ప్రస్తుతం సంస్కృతంపై ఈయన లోతైన అధ్యయనం చేస్తున్నారు. తల్లిదండ్రులు వెంపటి రాజ్యలక్ష్మి, జగన్నాథం పేరున ఫౌండేషన్‌ ఏర్పాటుచేసి స్వగ్రామంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టేకుపల్లి గ్రామానికి చెందిన అమరగాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుకు కూడా గతంలో ‘పద్మశ్రీ’ లభించింది. 

కుటుంబ నేపథ్యం.. 
వెంపటి కుటుంబశాస్త్రి 1950 ఆగస్టు 12న జన్మించారు. ఆయన ఎంఏ పీహెచ్‌డీ చేశారు. తిరుపతిలోని వేద పాఠశాలలో రుగ్వేద అధ్యయాన్ని పూర్తిచేశారు. వాల్తేరులోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి విద్యా ప్రవీణ (ఎంఏ), ప్రాచ్య శీర్షిక పరీక్షలో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి శిరోమణి (ఎంఏ), మరో ప్రాచ్య శీర్షిక పరీక్షలో అర్హత సాధించారు. 1992లో తమిళనాడులోని తిరుచిరాపల్లిలోని సంస్కృత సాహిత్య పరిషత్‌ నుంచి వేదాంత కేసరి బిరుదు పొందారు. 2004 ఢిల్లీలోని మందాకిని విద్వత్‌ పరిషత్‌ నుంచి విద్యాసాగర్‌ అవార్డు అందుకున్నారు. ఇలా అనేక అవార్డులు అందుకున్న కుటుంబ శాస్త్రి దివిసీమ వాసి కావడంతో ఈ ప్రాంతం వారు, కుటుంబ సభ్యుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.      

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)