Breaking News

ఎస్సీ గురుకులాల్లో వేతన వెతలు

Published on Sun, 06/21/2026 - 04:57

సాక్షి, అమరావతి: బీఆర్‌ అంబేడ్కర్‌ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న 1,800 మంది పార్ట్‌టైమ్‌ టీచర్లకు వేతన వెతలు తప్పడం లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏ నెలలోనూ సమయానికి జీతం ఇచ్చిన దాఖలాలు లేవు. చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్‌ మాసాలకు జీతాలు ఇవ్వలేదు. మే నెల గురుకులాల సెలవుల్లో వారికి ఉద్యోగ విరామం ఉంటుంది. మళ్లీ ఈ నెల నుంచి వారి ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్‌ చేయాల్సి ఉంది. ఈ నెల కూడా గడిస్తే వారికి మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. 

ప్రతిసారి ఇదే తంతు కొనసాగడంతో కుటుంబ పోషణ కష్టతరంగా మారుతోందని వారంతా వాపోతు­న్నారు. సకాలంలో వేతనాలు అందకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి దాపురించిందని చెబుతు­న్నారు. పేరుకు పార్ట్‌టైమ్‌ టీచర్లే అయినా వా­రితో నిబంధనలకు విరుద్ధంగా ఫుల్‌టైమ్‌ పని చేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. ఉదయం 7.30 గంటలకు స్కూల్‌ డ్యూటీ మొదలు పెట్టి.. సాయంత్రం 4 గంటల వరకు వారు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా స్టడీ అవర్స్‌ నిర్వహించాలనే ఒత్తిడి వారిపై ఉంది. 

దీనికితోడు రెగ్యులర్‌ స్టాఫ్‌ చేయాల్సిన విద్యార్థుల పర్యవేక్షణ బాధ్య­త, రికార్డుల పరిశీలన కూడా పార్ట్‌టైమ్‌ టీచర్ల నెత్తినే పడింది. ఇంత చేసినా.. నెలనెలా అందరితోపాటు సకాలంలో జీతాలు అందక ఇబ్బ­ందులు తప్పడం లేదని వాపోతున్నారు. స్కూ­ళ్లు, కాలేజీలు తెరిచిన ఈ సమయంలో పిల్లల చదువులకు ఫీజులు, పుస్తకాలు తదితర ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే వారు పడే అవస్థలు అన్నీఇన్నీ కాదు. ప్రభు­త్వం స్పందించి పెండింగ్‌ జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.

Videos

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)