Breaking News

‘నువ్వు అటెండర్‌గా పనికిరావు.. స్వీపర్‌గా పనిచేసుకో’

Published on Mon, 12/23/2024 - 13:22

కుప్పం: ‘నువ్వు అటెండర్‌గా పనికిరావు..స్వీపర్‌గా, తోటమాలిగా పనిచేసుకో’ అంటూ  రిజిస్టార్‌ వేధిస్తున్నారని బాధితురాలు మీడియాతో ఆదివారం వాపోయింది. బాధితురాలి కథనం మేరకు, 2007లో ద్రవిడ వర్శిటీలో భాగ్యలక్ష్మి అటెండర్‌గా చేరారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో అటెండర్‌గా పనిచేస్తున్నట్టు వెల్లడించారు. గతంలో వర్సిటీలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు సక్రమంగా ఇవ్వలేదని ఉద్యోగులు ధర్నాలు చేపట్టారు.

 అప్పట్లో భాగ్యలక్ష్మి అనారోగ్యం కారణంగా ఆ ధర్నాలకు హాజరు కాలేదు. దీంతో ఆమెపై యూనియన్‌ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. అంతేకాకుండా ధర్నాకు రాలేదని తమిళ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో భాగ్యలక్ష్మిపై దాడి చేయించి గాయపరిచారు. దీనిపై అప్పట్లో గుడుపల్లె పోలీస్‌ స్టేషన్‌లో భాగ్యలక్ష్మి ఇచ్చినా ఫిర్యాదు మేరకు ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసును వాపసు తీసుకోవాలని వర్సిటీ అధికారులు వేధిస్తున్నారని, చెప్పినట్లు వినకపోతే అటెండర్‌ నుంచి స్వీపర్‌గా మార్చుతామని బెదిరిస్తున్నట్లు ఆమె వాపోయారు. దీంతో పాటు తన భర్త గుండె నొప్పితో బాధపడుతున్నారని, ఈ విషయం వర్సిటీ అధికారులకు తెలిసినా మరింత ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.ఈ మేరకు వర్సిటీ మహిళా విభాగానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు.  

25న పేదింటి యువతి వివాహం


 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)