పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు
Breaking News
ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ
Published on Sat, 03/16/2024 - 13:34
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనకు సంబంధించి ఎట్టకేలకు పీటముడి వీడింది. ఏపీ భవన్ విభజన అంశం పరిష్కారం అయ్యిందని తాజాగా హోం శాఖ అధికారంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్షన్- జీకి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 11.536 ఎకరాలు కేటాయించారు. ఏపీకి 5.781 ఎకరాలు ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు కేటాయింపుకు సంబంధించిన కేంద్రం ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేంద్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.
అదేవిధంగా తెలంగాణకు 8.245ఎకరాలు కేటాయించారు. తెలంగాణకు శబరి బ్లాక్‌లో 3.00 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలను కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఏపి భవన్ విభజన: ఉత్తర్వులు జారీ చేసిన హోం శాఖ-ఇక్కడ క్లిక్ చేయండి
Tags : 1