Breaking News

కోతల్లేకుండా విద్యుత్‌ సరఫరా 

Published on Sun, 07/23/2023 - 04:48

సాక్షి, అమరావతి/దొండపర్తి (విశాఖ దక్షిణ) : నైరుతి రుతుపవనాల ఆలస్యం కారణంగా దక్షిణాదిన ఈ ఏడాది మే, జూన్‌ నెలల్లో మునుపెన్నడూ లేనంతగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగినప్పటికీ ఎలాంటి విద్యుత్‌ కోతలు లేకుండా సరఫరా చేసి దక్షిణ ప్రాంతీయ గ్రిడ్‌ సామర్థ్యాన్ని నిరూపించామని రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె. విజయానంద్‌ తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలలో విద్యుత్‌ రంగ అభివృద్ధి నిమిత్తం శుక్రవారం విశాఖపట్నంలో మొదలైన సదరన్‌ రీజనల్‌ పవర్‌ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) 47వ సమావేశం శనివారం ముగిసింది.

ప్రాంతీయ కమిటీకి చైర్మన్‌గా ఉన్న  విజయానంద్‌ అధ్యక్షతన కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌పీసీతో పాటు 45వ టెక్నికల్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ (టీసీసీ) సమావేశం కూడా జరిగింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులకు రాష్ట్ర విద్యు త్‌ సంస్థలైన ట్రాన్స్‌కో, డిస్కంలు ఆతిథ్యం ఇచ్చా యి.

ఈ సందర్భంగా విజయానంద్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వ్యవసాయ వినియోగదారులకు ప్రభు త్వం ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తోందని.. దీనికి ఖర్చుచేసే మొత్తాన్ని రైతుల ద్వారా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు బదిలీ చేయడానికి డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (డీబీటీ) పథకాన్ని అమలుచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే, రాష్ట్రంలో విద్యుత్‌ బిల్లుల వసూళ్ల కోసం అమలుచేస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఐ. పృథి్వతేజ్‌ ప్రతినిధులకు వివరించారు.   

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు లేఖ.. 
ఇక దక్షిణాది రాష్ట్రాల విద్యుత్‌ రంగ సంస్థలు, వాటి నిర్వహణ, వాణిజ్య కార్యకలాపాలు, సమస్యలు, వాటి పరిష్కారం కోసం పరస్పరం సహకరించుకోవడం, అందుకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం.. దక్షిణ గ్రిడ్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఎస్‌ఆర్‌పీసీ, ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ సంస్థల నుంచి అవసరమైన సలహాలు పొందడం వంటి అంశాలపై ఈ సదస్సులో ప్రతినిధులు చర్చించారు.

అలాగే, అంతర్రాష్ట్ర విద్యుత్‌ రవాణా చేసే ఇంట్రా స్టేట్‌ లైన్‌లకు సెంట్రల్‌ పూల్‌ నుంచి ట్రాన్స్‌మిషన్‌ చార్జీలను పొందేందుకు గతేడాది డిసెంబర్‌ 6న ఇచ్చిన    ఆదేశాలను అమలుచేయాలని విద్యుత్‌ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని కమిటీ తీర్మానించింది.  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)