Breaking News

ర్యాగింగ్‌ను నిరోధించండి

Published on Sun, 05/19/2024 - 05:30

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ను ఎలా నిరోధించాలనే దానిపై అన్ని రాష్ట్రాలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూ­జీసీ) మార్గదర్శకాలు జారీ చేసింది. ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోకపోయినా యూ­జీసీ ఇచ్చిన మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైనా ఆయా విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు పంపిన లేఖల్లో జిల్లా స్థాయి ర్యాగింగ్‌ నిరోధక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 

ఆ కమిటీకి కలెక్టర్‌/డిప్యూటీ కమిషనర్‌/జిల్లా మేజి్రస్టేట్‌ అధిపతిగా ఉండాలని, సభ్యులుగా వర్సిటీ/కళాశాల అధిపతులు, ఎస్పీ/ఎస్‌ఎస్‌పీను నియమించాలని పేర్కొంది. మెంబర్‌ సెక్రటరీగా అదనపు జిల్లా మేజి్రస్టేట్‌ ఉంటారని, కమిటీలో మీడియా ప్రతినిధులు, జిల్లాస్థాయి ఎన్జీవోలు, విద్యార్థి సంఘాలు, పోలీసులు, స్థానిక పరిపాలనతో పాటు సంస్థాగత అధికారులు ఉండాలని సూచించింది. కళాశాలల్లో యాంటీ ర్యాగింగ్‌ కమిటీ, యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్, యాంటీ ర్యాగింగ్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

కీలక ప్రదేశాల్లో సీసీటీవీలను అమర్చాలని చెప్పింది. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందిస్తూ యాంటీ ర్యాగింగ్‌ వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు నిర్వహించాలని కోరింది. వర్సిటీలు/విద్యా సంస్థల్లోని ముఖ్య ప్రదేశాల్లో యాంటీ ర్యాగింగ్‌ పోస్టర్‌లను ప్రదర్శించాలని వీటిని యూజీసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించింది. ర్యాగింగ్‌ బాధి­తులు హెల్ప్‌లైన్‌ 1800–180–5522 కు కాల్‌ చేయవచ్చని లేదా helpline @antiragging.in కు మెయిల్‌ పెట్టి సహయాన్ని కోరవచ్చని పేర్కొంది.       

 

Videos

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)