Breaking News

రోళ్లపాడులో తోడేళ్లు 

Published on Sun, 03/26/2023 - 04:32

ఆత్మకూరు రూరల్‌ (నంద్యాల): ‘ఇండియన్‌ ఊల్ఫ్‌’గా చెప్పుకునే తోడేళ్ల జనాభా దేశవ్యాప్తంగా మూడు వేల వరకు ఉండొచ్చని అటవీ శాఖ అంచనా. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌ పరిదిలోని రోళ్లపాడు పక్షుల అభయారణ్యంలోనూ తోడేళ్లు ఒకప్పుడు గణనీయంగానే ఉండేవి. కొన్నేళ్ల క్రితం వీటి ఉనికి ఇక్కడ పూర్తిగా కనుమరుగైంది.

అనూ­హ్యంగా ఈ ఏడాది జనవరిలో అభయా­ర­ణ్యం­లో ఒక అధికారికి తోడేలు కనిపించగా.. అటవీ శాఖ అధికారులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యా­రు. ఆ తరువాత వాటి ఉనికిపై ప్రత్యేక దృష్టి సారించగా.. రెండు తోడేళ్ల కుటుంబాలు ఇక్కడి అభయా­ర­ణ్యం­లో సంచరిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తోడేళ్లు సంఘ జీవనానికి పెట్టింది పేరు. ఇవి ప్రత్యే­కమైన గుంపులుగా నివసిస్తాయి. ఈ గుంపును ‘ప్యాక్‌’ అంటారు. ఒక ప్యాక్‌లో 8 వరకు తోడేళ్లు ఉం­­టాయి. 

దేశంలో 10 తోడేళ్ల అభయారణ్యాలు
అంతరించిపోతున్న తోడేళ్లను సంరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో 10 అభయా­ర­ణ్యా­లను ఏర్పాటు చేసింది. రాజస్థాన్‌లో కైలాదేవి అభ­యారణ్యం, కుంబాల్‌ ఘర్‌ అభయారణ్యం, తోడ్‌ ఘర్‌ రోలి అభయారణ్యం, మౌంట్‌ ఆబు అభయా­రణ్యం, గుజరాత్‌లోని బ్లాక్‌ బక్‌ అభ­యారణ్యం, కఛ్‌ బస్టర్డ్‌ అభయారణ్యం, నారా­యణ్‌ సరోవర్‌ అభయారణ్యం, శూల్‌ పాణేశ్వర్‌ అభయా­రణ్యం, కర్ణాటకలోని రాణి బెన్నూర్‌ బ్లాక్‌ బక్‌ అభయారణ్యం, మహారాష్ట్రలోని రెహే కురి బ్లాక్‌ బక్‌ అభయారణ్యాలలో తోడేళ్లను సంరక్షిస్తున్నారు.

బట్టమేక పక్షుల అభయారణ్యంలో..
ఏపీలో తోడేళ్ల సంరక్షణకు ప్రత్యేకించి అభయా­రణ్యాలు ఏర్పాటు చేయనప్పటికీ బట్టమేక పక్షుల సంరక్షణకు ఏర్పాటు చేసిన రోళ్లపాడు అభయా­రణ్యంలో కృష్ణజింకలతో కలసి తోడేళ్లు సహవాసం చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

తోడేళ్లు తన సహజ జాతి మాంసాహార జంతువులైన హైనాలు, నక్కల తరహాలో వేరే జంతువులు వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తినే జీవులు కావు. ఇవి తమ ఆహారాన్ని స్వయంగా వేటాడి సంపాదించుకుంటాయి. తమకు అందుబాటులో ఉండే కృష్ణ జింకలు, సమీప గ్రామాల్లో ఉండే మేకలు, గొర్రెలను ఇవి వేటాడుతుంటాయి.

తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం
రోళ్లపాడు బట్టమేక పక్షుల అభ­యా­రణ్యంలో తోడేళ్ల ఉనికిని ఇటీవల గుర్తించాం. ఒకప్పు­డు ఈ అభయా­రణ్యం పరి­ధిలో విస్తారంగా కనిపించిన ఇండియన్‌ ఊల్ఫ్‌ తదనంతరం అదృశ్యమైంది. అనూహ్యంగా ఇటీవల మాకు తోడేళ్లు కనిపించడం సంతోషదాయకం. రెండు ప్యాక్‌ల తోడేళ్లు రోళ్లపాడులో ఉండవచ్చని అంచనా.
– అలాన్‌ చోంగ్‌ టెరాన్, డీడీ, ప్రాజెక్ట్‌ టైగర్, ఆత్మకూరు

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)