Breaking News

విశాఖ జైలులో కలకలం.. బ్యారక్‌ వద్ద సెల్‌ ఫోన్స్‌ పాతిపెట్టి..

Published on Wed, 01/01/2025 - 11:33

సాక్షి, విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ ఫోన్లు దొరకం తీవ్ర కలకలం రేపుతోంది. భూమిలో నాలుగు అడుగల లోతున సెల్‌ ఫోన్లను దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

వివరాల ప్రకారం.. విశాఖ సెంట్రల్ జైలులో సెల్‌ ఫోన్లు దొరకం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్‌ ఫోన్స్‌ దొరికాయి. బ్యారక్‌ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్‌ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. ఆ కవర్‌లో రెండు సెల్‌ఫోన్లు, ఒక పవర్‌ బ్యాంక్, రెండు చార్జింగ్‌ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

ఇక, దొరికిన సెల్‌ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవర్ దొరికిన పెన్నా బ్యారక్‌లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్, ఇతర ఖైదీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. సెల్‌ఫోన్ల ఘటనపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)