కాకుల కొండ వద్ద చిరుత కళేబరం

Published on Fri, 08/18/2023 - 03:33

మడకశిర రూరల్‌: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం మెళవాయి సమీపంలోని కాకులకొండ వద్ద గురువారం మగ చిరుత కళేబరాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించారు. బుధవారం ఆడ చిరుత కళేబరం కనిపించిన నేపథ్యంలో ఘటనా స్థలంలో ఆనవాళ్లు గుర్తించేందుకు గురువారం అటవీశాఖ అధికారులు కొండలోని గుంతలో పరిశీలించగా అక్కడ మగ చిరుత కళేబరాన్ని గుర్తించారు. విషయాన్ని అటవీశాఖ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. జిల్లా అటవీశాఖ అధికారి రవీంద్రారెడ్డి, పెనుకొండ అటవీశాఖ డివిజన్‌ అధికారి ఆనంద్, రేంజ్‌ అధికారి శ్రీనివాసరెడ్డి, పశుసంవర్థక శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అమర్‌ ఘటనాస్థలికి చేరుకుని గుంతలో ఉన్న చిరుత కళేబరాన్ని పరిశీలించారు.

ఆడ చిరుతలాగే తాజాగా లభించిన మగ చిరుత కూడా మృతి చెందిన సమయంలో మల, మూత్ర విసర్జన చేసింది. సమీపంలో ఏదో ద్రవ పదార్థం ఉందన్న అనుమానంతో నమూనాలను సేకరించారు. చిరుత కళేబరాన్ని మడకశిర అటవీశాఖ కార్యాలయానికి తీసుకువచ్చారు. వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ అమర్‌ బుధ, గురువారాల్లో లభించిన ఆడ, మగ చిరుతలకు పోస్టుమార్టం నిర్వహించి కళేబరాలను కాల్చి వేశారు. రవీంద్రారెడ్డి మాట్లాడుతూ..2 చిరుతలూ ఒకే రోజు మృతి చెంది ఉండవచ్చని చెప్పారు.

వీటి వయసు రెండేళ్లు ఉంటుందన్నారు. ఈ చిరుతల తల్లి కూడా కొండ ప్రాంతంలో ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం ద్వారా సేకరించిన నమూనాలను తిరుపతి, విజయవాడ, బెంగళూరు ల్యాబ్‌లకు పంపుతున్నట్లు తెలిపారు. ఈ రెండు చిరుతలకు ఎలాంటి గాయాలు లేవని, రెండూ ఒకే కారణంతో మృతి చెంది ఉంటాయని వెటర్నరీ ఏడీ తెలిపారు. విష ప్రయోగమా...? లేదా వ్యాధి సోకి మృతి చెందాయా..? అన్నది ల్యాబ్‌ రిపోర్టుల ద్వారా తెలుస్తుందన్నారు.

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)