Breaking News

వివాహేతర సంబంధం మహిళ ప్రాణాన్ని బలి తీసుకుంది

Published on Mon, 01/26/2026 - 04:10

చేబ్రోలు: వివాహేతర సంబంధం నేపథ్యంలో రేగిన చిచ్చు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లిలో ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా సుద్దపల్లి గ్రామానికి చెందిన ఆలకుంట మల్లేష్ కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా కొడుకుతో కలిసి తెనాలిలోని సీఎం కాలనీలో ఉంటున్న కొల్లా దుర్గ(28)తో ఆరేళ్లుగా వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. 

కొంతకాలంగా మల్లేష్‌కు, దుర్గకు మధ్య మనస్పర్థలొచ్చాయి. ఇవి కేసుల వరకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి మల్లేష్‌ ఇంటికి వెళ్లిన కొల్లా దుర్గతో అతని కుటుంబ సభ్యులు గొడవ పడ్డారు. ఆవేశంలో దుర్గతోపాటు మల్లేష్‌ కుటుంబ సభ్యులు పరస్పరం పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో దుర్గకు 80శాతం శరీరం కాలిపోయింది. మల్లేష్‌ భార్య, పిల్లలతో సహా తొమ్మిది మందికి కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ కొల్లా దుర్గ ఆదివారం ఉదయం మరణించింది.   

కేసును పక్కదారి పట్టిస్తున్నారు 
తన కుమార్తె దుర్గది ముమ్మాటికీ హత్యేనని ఆమె తల్లి ప్రతివాడ చిన్ని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఫిర్యాదును తీసుకోవడం లేదని ఆరోపించారు. మృతురాలి తల్లి, అక్కచెల్లెళ్లు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ దుర్గపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి దారుణంగా చంపారని కన్నీరుమున్నీరయ్యారు. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)