Breaking News

3 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ నేడే

Published on Thu, 02/27/2025 - 05:28

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగే ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా–గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్‌ స్థానాలు, ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 70 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,062 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. మార్చి 3న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 

పోలింగ్‌ కోసం 6,287 మంది పోలింగ్‌ సిబ్బందిని, 8,515 మంది పోలింగ్‌ సిబ్బందిని కేంద్ర ఎన్నికల సంఘం వినియోగిస్తోంది. అన్ని కేంద్రాల్లో పోలింగ్‌ను లైవ్‌వెబ్‌ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేయనున్నట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల నిరంతర పర్యవేక్షణకు సచివాలయంలోని ప్రధాన ఎన్నికల కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. 

ఓట్ల లెక్కింపునకు తూర్పు–పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్‌ స్థానానికి ఏలూరు సీఆర్‌ రెడ్డి కళాశాలలో కౌంటింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్స్‌ కౌంటింగ్‌ గుంటూరు ఏసీ కాలేజీలో జరగనుంది. శ్రీకాకుళం –విజయనగరం – విశాఖ టీచర్ల స్థానానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కౌంటింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్స్‌ స్థానానికి 35 మంది పోటీ 
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి అత్యధికంగా 35 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 3,14,984 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 1,83,347 మంది, మహిళలు 1,31,618 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. ఉమ్మడి కృష్ణా–గుంటూరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 25 మంది పోటీ పడుతున్నారు. 



ఈ నియోజకవర్గంలో మొత్తం గ్రాడ్యుయేట్‌ ఓటర్లు 3,47,116 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 2,06,456 మంది, మహిళలు 1,40,615 మంది, ఇతరులు 45 మంది ఉన్నారు. ఉమ్మడి ఉత్తరాంద్ర జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవరా>్గనికి 10 మంది పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 22,493 మంది ఉన్నారు. వీరిలో 13,508 మంది పురుషులు, 8,985 మంది మహిళలు ఉన్నారు.   

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు