Breaking News

నేటి నుంచి పసుపు కొనుగోళ్లు

Published on Mon, 06/05/2023 - 03:37

సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా ధరలేక ఇబ్బ­ందిపడుతున్న పసుపు రైతుకు అండగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనీస మద్దతు ధర రూ.6,850గా నిర్ణయించి,  20వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఆర్బీకేల ద్వారా ఈ నెల 5వ తేదీ నుంచి కొనుగోలు చేసేందుకు ఏపీ మార్క్‌ఫెడ్‌ ఏర్పాట్లు చేసింది.  

నాలుగేళ్లలో 52 వేల టన్నుల పసుపు కొనుగోలు 
కేంద్రం కనీస మద్దతు ధరలు ప్రకటించే  పంటల జాబితాలో లేని పసుపునకు గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రక­టిస్తోంది. ధర తగ్గిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మార్కె­ట్‌లో జోక్యం చేసుకుని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది.

ఇలా 2019–20 నుంచి ఇప్పటివరకు 29,193 మంది రైతుల నుంచి రూ.405.11 కోట్ల విలువైన 52,456.82 టన్నుల పసుపును సేకరించింది. అదే టీడీపీ ఐదేళ్ల పాలనలో 28 వేలమంది రైతుల నుంచి రూ.305 కోట్ల విలువైన 48,540.38 టన్నులను మాత్రమే కొనుగోలు చేశారు. ప్రభుత్వ చర్యల ఫలితంగా గత రెండేళ్లుగా పసుపు ధరలు ఆకాశానికి ఎగబాకాయి. ఒకదశలో క్వింటా రూ.10 వేలకుపైగా పలికింది.

నెలరోజుల కిందటి వరకు రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్య పలికింది. సాధారణంగా 50 శాతం రాష్ట్ర పరిధిలో వినియోగిస్తుండగా, 20 శాతం పొరుగు రాష్ట్రాలకు, 30 శాతం ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. 2022–23లో రికార్డు స్థాయిలో 84 వేల ఎకరాల్లో సాగుచేయగా, నాలుగు లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. ఇప్పటికే 50 శాతానికిపైగా మార్కెట్‌కు వచ్చింది.  

సీఎం యాప్‌ ద్వారా నిరంతర పర్యవేక్షణ 
డిమాండ్‌కు మించి పసుపు వస్తుండడంతో పాటు దేశీయంగా నెలకొన్న పరిస్థితుల నేప­థ్య­ం­ల­ో కొద్దిరోజులుగా మార్కెట్‌లో ధరలు తగ్గు­ముఖం పట్టాయి. ప్రస్తుతం నాణ్యమైన పసుపు క్వింటా ధర రూ.5,500 నుంచి రూ.6,300 వర­కు­పలుకుతోంది.

సీఎం యాప్‌ ద్వారా మార్కెట్‌ ధరలను ఎప్పటికప్పుడు పర్య­వేక్షి­స్తున్న ప్రభుత్వం పసుపు రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. మరోసారి మార్కె­ట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద మార్కె­ట్‌లో జోక్యం చేసుకుంటోంది. ఇప్పటివరకు మార్కెట్‌కు ఎంత వచ్చింది. ఇంకా రైతుల వద్ద ఏ మేరకు నిల్వలున్నాయని ఆర్బీకే స్థాయిలో సర్వే చేసింది.

వైఎస్సార్, నంద్యాల, అన్నమయ్య, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల పరిధిలోని రైతుల వద్ద పసుపు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఆయా జిల్లాల పరిధిలోని ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. రైతుల వద్ద ఉన్న పసుపు నిల్వలను నాణ్యతను బట్టి కనీస మద్దతు ధర రూ.6,850కి కొనుగోలు చేయనుంది.

సీఎం ఆదేశాల మేరకు.. 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కనీస మద్దతు ధరకు రైతుల వద్ద ఉన్న పసుపును ఆర్బీకేల ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశాం. ఆర్బీకేల ద్వారా రైతులు తమ వివరాలను నమోదు చేసుకుంటే, వారివద్ద ఉన్న ఫైన్‌ క్వాలిటీ పసుపును కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు.  – రాహుల్‌పాండే, ఎండీ, ఏపీ మార్క్‌ఫెడ్‌ 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)