Breaking News

ప్రమాదంలో తుంగభద్ర డ్యాం 7 గేట్లు

Published on Sun, 08/17/2025 - 05:36

హొళగుంద:  తుంగభద్ర డ్యాం మళ్లీ ప్రమాదం అంచున ఉంది. గతేడాది 19వ గేటు నదిలో కొట్టుకుపోగా టీబీ బోర్డు అధికారులు దాని స్థానంలో స్టాప్‌లాగ్‌ గేట్‌ ఏర్పాటు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. అయితే మిగిలిన గేట్లకూ కాలం చెల్లిందని, మొత్తం గేట్లను మార్చాలని గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడు ఇచి్చన నివేదిక ఆధారంగా మొత్తం 33 కొత్త గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. సేఫ్టీ కోసం 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని 80 టీఎంసీలకు కుదించి ఖరీఫ్‌కు మాత్రమే నీళ్లిచ్చి రబీ సమయంలో పనులు మొదలు పెట్టెందుకు నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇంకా సమయం ఉండడం, జలాశయానికి వరద పెద్ద ఎత్తున వస్తుండడంతో మళ్లీ ఎక్కడ కొత్త సమస్య వస్తుందోనని టీబీ బోర్డు అధికారులతో పాటు ఏపీ, కర్ణాటకకు చెందిన కర్నూలు, బళ్లారి, రాయచూరు, అనంతపురం జిల్లా రైతులు ఆందోళన చెందుతున్నారు. 19వ స్టాప్‌లాగ్‌ గేటు మినహాయించి మిగిలిన 32 గేట్ల పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా.. అందులో 4, 11, 18, 20, 24, 27, 28వ గేట్లు మరీ అధ్వాన స్థితికి చేరినట్లు తెలుస్తోంది.

ఆ గేట్లు రెండు మీటర్ల ఎత్తు వరకు ఎత్తేందుకూ సమస్యగానే ఉందని అధికారులు చెబుతున్నారు. తుప్పు పట్టి ఉండటంతో ఆ గేట్లను ఎత్తితే.. దింపడం, దించితే ఎత్తడం ఇబ్బందికరమంటున్నారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనంటూ కన్నడ టీవీ చానళ్లలో ప్రసారమైన వార్తలు శనివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)