Breaking News

సోషల్‌ జస్టిస్‌కు నిలువెత్తు సాక్ష్యం..

Published on Sun, 04/14/2024 - 05:15

సాక్షి, అమరావతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నిలువెత్తు స్ఫూర్తి సామాజిక న్యాయ మహా శిల్పం రూపంలో సగర్వంగా నిలిచింది. విజయవాడ నగరం నడిబొడ్డున స్వరాజ్‌ మైదానం 18.81 ఎకరాల్లో రూ.404.35 కోట్లతో విగ్రహ నిర్మాణాన్ని పూర్తిచేయడం విశేషం. అలాగే 81 అడుగుల ఎత్తులో కాంక్రీట్‌ పీఠం(ఫెడస్టల్‌)పై 125 అడుగుల ఎత్తుగల ఈ  అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం కొలువై ఉంది. స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌(సామాజి­క న్యాయ మహా శిల్పం)ను దేశానికే  ఆదర్శంగా తీర్చిదిద్దారు.

గత టీడీపీ ప్రభుత్వం ఎక్కడో మారుమూల ప్రాంతంలో అంబేడ్కర్‌ స్మృతివనాన్ని నిర్మిస్తామని స్థలం ఎంపిక చేసి కనీస కార్యాచరణ లేకుండా గాలికొదిలేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం చెప్పింది చేసి చూపించేలా సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ఆవి­ష్క­రించి చరిత్ర సృష్టించారు. దేశీయంగా తయారైన ఈ కాంస్య విగ్రహం ప్రపంచంలోనే ఎత్తయినది, దేశంలోని మతాతీత విగ్రహాల్లో ఇదే అతి పెద్దది కావడం మరో విశేషం.

అంతటి స్ఫూర్తివంతమైన సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంగణంలో అంబేడ్కర్‌ 133వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు శనివారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్‌కు లోబడి నిర్వ­హించేలా చర్యలు చేపట్టారు. ప్రజలు, సామాజికవేత్తలు, అంబేడ్కర్‌ వాదులు విగ్ర­హాన్ని సందర్శించి నివాళులర్పించేలా ఏర్పాట్లు చేశారు.  

దర్శనీయక్షేత్రంగా..  
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తిని రాష్ట్ర ప్రజలకు అందించేలా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇది ప్రముఖ దర్శనీయ క్షేత్రంగా అందరికీ అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో విజయవాడ నగర నడిబొడ్డున చరిత్రాత్మక స్వరాజ్‌ మైదానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది.

సాధారణ ప్రజలు ఉదయం, సాయంత్రం నడక కోసం ఈ ప్రాంతాన్ని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. పచ్చని ప్రకృతి ప్రతిబింబించేలా సౌందర్యవంతంగా దీనిని తీర్చిదిద్దారు. సామాజిక న్యాయ మహాశిల్పం ప్రాంతంలో మరెన్నో ప్రత్యేకతలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్, రెండు వేల మంది కూర్చునేలా కన్వెన్షన్‌ సెంటర్, ఫుడ్‌ కోర్ట్, చి్రల్డన్స్‌ ప్లే ఏరియా, వాటర్‌ బాడీస్, మ్యూజికల్‌ ఫౌంటెన్, లాంగ్‌ వాక్‌ వేస్‌తో సహా మొత్తం ప్రాంతాన్ని తీర్చిదిద్దడం విశేషం.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)